బాలయ్యకు భారీ షాక్ ఇచ్చిన బాహుబలి?..

  • Published By: sekhar ,Published On : September 22, 2020 / 08:52 PM IST
బాలయ్యకు భారీ షాక్ ఇచ్చిన బాహుబలి?..

Updated On : September 22, 2020 / 9:10 PM IST

Prabhas Next film Based on Time Machine Concept: బాలయ్యకు బాహుబలి షాక్ ఇచ్చాడంటూ ఫిలిం వర్గాల్లో ఓ ఆసక్తికరమైన చర్చ జరుగుతోంది. వివరాళ్లోకి వెళ్తే.. నటసింహా నందమూరి బాలకృష్ణ నటించిన చిత్రాల్లో కల్ట్ క్లాసిక్‌గా చెప్పుకునే చిత్రం.. ‘ఆదిత్య 369’.. తెలుగులో ఇంతకుముందెన్నడూ వెండితెరపై చూడని గొప్ప అద్భుతాన్ని సైన్స్ ఫిక్షన్ రూపంలో ఈ చిత్రంతో ఆవిష్కరించారు లెజెండరీ డైరెక్టర్ సింగీతం శ్రీనివాసరావు.


ప్రేక్షకాభిమానులకు ఓ కొత్త అనుభూతి కలిగించిన ‘ఆదిత్య 369’ చిత్రానికి సీక్వెల్‌గా బాలయ్య, సింగీతం కలయికలోనే ‘ఆదిత్య 999’ మూవీ చేయాలనుకున్నారు. ఎప్పటి నుంచో ఈ సినిమా వార్తల్లో ఉంటుంది కానీ.. కార్యరూపం దాల్చలేదు.


అయితే.. ఇప్పుడు సింగీతంను రెబ‌ల్‌స్టార్ ప్ర‌భాస్, ప్రామిసింగ్ డైరెక్ట‌ర్ నాగ్ అశ్విన్ కాంబినేష‌న్‌లో రూపొంద‌నున్న ఎపిక్ ఫిల్మ్‌కు తీసుకోవడం చర్చనీయాంశమైంది.. ప్రభాస్, నాగ్ అశ్విన్ మూవీ ఎనౌన్స్ చేశారు కానీ.. జోనర్ ఏంటనేది మాత్రం ప్రకటించలేదు. దీంతో రకరకాల కథనాలు వచ్చాయి.


ఇప్పుడు వినిపిస్తున్న ఆసక్తికరమైన వార్త ఏంటంటే.. ఇది టైమ్ మిషన్ కాన్సెప్ట్‌తో రూపొందే సినిమా అట. అందుకనే టైమ్ మిషన్ కాన్సెప్ట్‌తో తెలుగు చలనచిత్ర చరిత్రలో ఓ మరపురాని చిత్రంగా నిలిచిపోయే సినిమా తీసిన సీనియర్ డైరెక్టర్ సింగీతంను ఈ మూవీ కోసం తీసుకున్నారట.


అయితే.. సింగీతం ఈ ప్రాజెక్టులోకి రావడంతో ఒక విధంగా బాలయ్యకు బాహుబలి షాక్ ఇచ్చాడు.. అంటున్నారు సినీ వర్గాలవారు. ఒకవేళ తాను చేయకపోయినా తనయుడు మోక్షజ్ఞను ‘ఆదిత్య 999’ తోనే హీరోగా లాంచ్ చేయాలని భావించిన బాలయ్య.. సంవత్సారల తరబడి ఏ విషయం తేల్చకుండా సింగీతంను వెయిట్ చేయించడం కూడా ఇందుకు కారణమనే మాట కూడా వినిపిస్తోంది.