Prabhas : పిలకతో ఎంట్రీ ఇచ్చిన ప్రభాస్.. ‘స్పిరిట్’ లుక్ లో ‘రాజాసాబ్’ ప్రీ రిలీజ్ ఈవెంట్..

నేడు రాజాసాబ్ సినిమా ప్రీ రిలీజ్ ఈవెంట్ హైదరాబాద్ లో భారీగా నిర్వహిస్తున్నారు. (Prabhas)

Prabhas : పిలకతో ఎంట్రీ ఇచ్చిన ప్రభాస్.. ‘స్పిరిట్’ లుక్ లో ‘రాజాసాబ్’ ప్రీ రిలీజ్ ఈవెంట్..

Prabhas

Updated On : December 27, 2025 / 9:26 PM IST

Prabhas : ప్రభాస్ హీరోగా మారుతీ దర్శకత్వంలో తెరకెక్కుతున్న సినిమా ‘రాజాసాబ్’. పీపుల్ మీడియా ఫ్యాక్టరీ బ్యానర్ పై విశ్వప్రసాద్ నిర్మాణంలో తెరకెక్కుతున్న ఈ సినిమాలో నిధి అగర్వాల్, మాళవిక మోహనన్, రిధి కుమార్ హీరోయిన్స్ గా నటిస్తున్నారు. మొదటిసారి ప్రభాస్ హారర్ కామెడీ చేస్తుండటంతో ఈ సినిమాపై ఆసక్తి నెలకొంది. రాజాసాబ్ సినిమా సంక్రాతి కానుకగా జనవరి 9న రిలీజ్ కానుంది.(Prabhas)

నేడు ఈ సినిమా ప్రీ రిలీజ్ ఈవెంట్ హైదరాబాద్ లో భారీగా నిర్వహిస్తున్నారు. ప్రభాస్ చాన్నాళ్ల తర్వాత జనాల ముందుకు వస్తుండటంతో ఈ ఈవెంట్ పై అంచనాలు నెలకొన్నాయి. ఈ ఈవెంట్లో ప్రభాస్ ఎంట్రీ అదిరిపోయింది. పిలక వేసుకొని వచ్చి సరికొత్త లుక్ లో అదరగొట్టాడు. దీంతో ప్రభాస్ ఫొటోలు, వీడియోలు వైరల్ గా మారాయి.

Also Read : Rajasaab : అసలు ఇదేం ప్లాన్ ‘రాజాసాబ్’.. ఇప్పుడు సడెన్ గా ఇన్ని రోజుల ముందే ప్రీ రిలీజ్ ఈవెంట్ ఏంటి..?

గతంలో కల్కి సినిమాలో పిలక వేసుకొని ప్రభాస్ అలరించాడు. ఇప్పుడు బయట ఈవెంట్ కి ఇలా పిలక వేసుకొని రావడంతో ఫ్యాన్స్ ఈ కొత్త లుక్ చూసి ఆశ్చర్యపోతున్నారు. అయితే ప్రభాస్ త్వరలో స్పిరిట్ సినిమా షూటింగ్ మొదలుపెట్టనున్నాడు. దీంతో ఇది స్పిరిట్ లుక్ అని పలువురు అభిప్రాయపడుతున్నారు. మరికొంతమంది అయితే కల్కి 2 లుక్ అని, లేదా సరదాగా ఈవెంట్ కి ఇలా పిలక వేసుకొచ్చాడు అని అంటున్నారు. అయితే స్పిరిట్ షూట్ నుంచే వస్తున్నాను అని సుమ అడిగిన ప్రశ్నల్లో ప్రభాస్ తెలిపాడు. దీంతో ఈ లుక్ స్పిరిట్ సినిమా అని తెలిసిపోతుంది. మొత్తానికి ప్రభాస్ తన పిలక హెయిర్ స్టైల్ తో వైరల్ అవుతున్నాడు.