ఫ్రేమ్ ఫుల్ – హీరోలు జిల్ జిల్

యంగ్ రెబల్ స్టార్ ప్రభాస్, యంగ్ టైగర్ ఎన్టీఆర్, మెగా పవర్ స్టార్ రామ్ చరణ్, దగ్గుబాటి రానా, న్యాచురల్ స్టార్ నాని కలిసి దిగిన ఒక ఫోటో సోషల్ మీడియాలో తెగ వైరల్ అవుతుంది.

  • Published By: sekhar ,Published On : January 4, 2019 / 12:17 PM IST
ఫ్రేమ్ ఫుల్ – హీరోలు జిల్ జిల్

యంగ్ రెబల్ స్టార్ ప్రభాస్, యంగ్ టైగర్ ఎన్టీఆర్, మెగా పవర్ స్టార్ రామ్ చరణ్, దగ్గుబాటి రానా, న్యాచురల్ స్టార్ నాని కలిసి దిగిన ఒక ఫోటో సోషల్ మీడియాలో తెగ వైరల్ అవుతుంది.

రాజమౌళి తనయుడు కార్తికేయ మ్యారేజ్ పూజా ప్రసాద్‌తో డిజెంబర్ 30వ తేదీన, జైపూర్‌లో గ్రాండ్‌గా జరిగింది. పెళ్ళిలో ప్రభాస్, రాజమౌళి డ్యాన్సింగ్ వీడియో, ఎన్టీఆర్, జై బాలయ్యా అని అరిచిన వీడియో, నాగార్జున శివ సినిమాలో పాటకి డ్యాన్స్ చేసిన పిక్స్, ప్రభాస్, సుస్మితా సేన్ కలిసి దిగిన పిక్, సుస్మితా సేన్ షేర్ చేసిన కార్తికేయ, పూజల పెళ్ళి వీడియో, పెళ్ళికి జైపూర్ వెళ్ళేటప్పుడు, ఎన్టీఆర్, చరణ్, అనుష్క ముగ్గురూ విమాన సిబ్బందితో దిగిన ఫోటో ఏ రేంజ్‌లో వైరల్ అయ్యాయో, అవుతున్నాయో చూస్తున్నాం.

ఇప్పుడు జైపూర్ వెడ్డింగ్ వెన్యూ నుండి మరో కొత్త ఫోటో వచ్చింది. యంగ్ రెబల్ స్టార్ ప్రభాస్, యంగ్ టైగర్ ఎన్టీఆర్, మెగా పవర్ స్టార్ రామ్ చరణ్, దగ్గుబాటి రానా, న్యాచురల్ స్టార్ నాని కలిసి దిగిన ఒక ఫోటో సోషల్ మీడియాలో తెగ వైరల్ అవుతుంది. హీరోలంతా ఒక చోటచేరి, సందడిగా గడుపుతూ, ఫోటోలకు పోజులివ్వడంతో, ఆయా హీరోల అభిమానులు.. ఫ్రేమ్ ఫుల్, హీరోలంతా జిల్ జిల్ అంటూ, ఈ ఫోటోని ఆన్‌‌లై‌న్‌లో షేర్ చేస్తున్నారు.