Prabhas : తాత, మనవడు రోల్స్‌లో ప్రభాస్.. ‘రాజాసాబ్’లో మరోసారి ప్రభాస్ డ్యూయల్ రోల్..
తాజాగా రిలీజ్ చేసిన మోషన్ పోస్టర్ లో ముసలి గెటప్ లో ఉన్నాడు ప్రభాస్.

Prabhas Playing Duel Role in Raja Saab Granad Father and Grand Son Charcters
Prabhas : ప్రభాస్ ప్రస్తుతం రాజాసాబ్ సినిమాతో బిజీగా ఉన్నాడు. నేడు ప్రభాస్ పుట్టిన రోజు సందర్భంగా రాజాసాబ్ సినిమా నుంచి మోషన్ పోస్టర్ రిలీజ్ చేసారు. అయితే ఈ మోషన్ పోస్టర్ లో ప్రభాస్ తాత గెటప్ లో ఉన్నాడు. గతంలో ప్రభాస్ ఇందులో తాత గెటప్ లో కనిపిస్తాడని, డ్యూయల్ రోల్ చేస్తారని వార్తలు వచ్చాయి. నేడు మోషన్ పోస్టర్ తో దీనిపై క్లారిటీ ఇచ్చారు మూవీ టీమ్.
గతంలో రిలీజ్ చేసిన గ్లింప్స్, పోస్టర్స్ లో ప్రభాస్ యంగ్ పాత్రలో ఉండగా తాజాగా రిలీజ్ చేసిన మోషన్ పోస్టర్ లో ముసలి గెటప్ లో ఉన్నాడు ప్రభాస్. దీంతో రాజాసాబ్ సినిమాలో ప్రభాస్ తాత, మనవడు పాత్రల్లో డ్యూయల్ రోల్ చేయబోతున్నట్టు తెలుస్తుంది. గతంలో ప్రభాస్ బిల్లా, బాహుబలి సినిమాలలో డ్యూయల్ రోల్ చేసాడు.
Also Read : Raja Saab : ప్రభాస్ బర్త్ డే స్పెషల్.. ‘రాజాసాబ్’ మోషన్ పోస్టర్ వచ్చేసింది.. తాత గెటప్ లో ప్రభాస్..
ఇక రాజాసాబ్ సినిమా హారర్ కామెడీ అని చెప్పడంతో నేడు రిలీజ్ చేసిన మోషన్ పోస్టర్ తో తాత దయ్యం పాత్ర అని మనవడు హీరో అని తెలుస్తుంది. దీంతో ప్రభాస్ కెరీర్లో మొదటిసారి హారర్ సినిమా చేస్తుండటంతో ఈ సినిమాపై అంచనాలు నెలకొన్నాయి. ఈ సినిమా మారుతి దర్శకత్వంలో పీపుల్ మీడియా ఫ్యాక్టరీ నిర్మాణంలో తెరకెక్కుతుండగా ఇందులో మాళవిక మోహనన్, నిధి అగర్వాల్, రిద్ధి కుమార్ హీరోయిన్స్ గా నటిస్తున్నారు. తాజాగా రిలీజ్ చేసిన మోషన్ పోస్టర్ తో పాటు గతంలో రిలీజ్ చేసిన గ్లింప్స్ కూడా చూసేయండి..