Radhe Shyam: గండికోటలో ప్రభాస్.. ఫోటోలు లీక్!
బాహుబలి నుండి పాన్ ఇండియా స్టార్ గా ఎదిగిన ప్రభాస్ ఇప్పుడు ఒకవైపు సలార్, ఆదిపురుష్ సినిమాలతో పాటు రాధేశ్యామ్ కూడా పూర్తిచేసే పనిలో ఉన్నాడు.

Radhe Shyam
Radhe Shyam: బాహుబలి నుండి పాన్ ఇండియా స్టార్ గా ఎదిగిన ప్రభాస్ ఇప్పుడు ఒకవైపు సలార్, ఆదిపురుష్ సినిమాలతో పాటు రాధేశ్యామ్ కూడా పూర్తిచేసే పనిలో ఉన్నాడు. జిల్ ఫేమ్ రాధాకృష్ణ తెరకెక్కిస్తున్న ఈ సినిమా మీద కూడా ఇండియా స్థాయిలో భారీ అంచనాలున్నాయి. రాధేశ్యామ్ నుండి వచ్చిన మోషన్ పోస్టర్ యూట్యూబ్ లో ఇప్పటికీ రికార్డులను తిరగరాస్తుంది. ఇది ఒకవిధంగా ప్రభాస్ మేనియాకు అద్దంపట్టేదిగా చెప్పుకుంటున్నారు.

Radhe Shyam
కాగా, తాజాగా రాధేశ్యామ్ కొత్త షెడ్యూల్ మొదలుకాగా ఇందులో భాగంగా ప్రస్తుతం ఆంధ్రప్రదేశ్ కడప జిల్లా జమ్మలమడుగు గండికోట పరిసర ప్రాంతాలలో షూటింగ్ జరుపుకుంటుంది. శుక్రవారం గండికోటలో మొదలైన షూటింగ్ ఆదివారం వరకు అక్కడే సన్నివేశాలను తెరకెక్కించారు. మొదటి రోజు కోటలోని మాధవరాయ స్వామి దేవాలయం, కోట ముఖ ద్వారం వద్ద సాంగ్ షూటింగ్ జరగగా.. రెండు, మూడు రోజులలో కొన్ని సన్నివేశాలను తెరకెక్కించారు.

Radhe Shyam
గండికోటలో షూటింగ్ లో ప్రభాస్, పూజాహెగ్డేతో పాటు మరో ముఖ్య నటుడు సత్యరాజ్ కూడా పాల్గొన్నాడు. ఇందులో వేద పాఠశాలకు చెందిన గురువుగా సత్యరాజ్ కనిపించనున్నారు. ఆయనతో పాటు కొందరు అఘోరాలకి సంబంధించిన సన్నివేశాలను గండికోటలో చిత్రీకరణ జరిపారు. గండికోటలో రాధేశ్యామ్ షూటింగ్ జరుగుతుందన్న సమాచారంతో ప్రజలు అక్కడికి చేరుకోగా కొందరు ఫోటోలు తీసి సోషల్ మీడియాలో పంచుకోవడంతో వైరల్ గా మారాయి.

Radhe Shyam

Radhe Shyam

Radhe Shyam