Baahubali Re Release : ‘బాహుబలి’ రీ రిలీజ్ టార్గెట్ 200 కోట్లు..? రీ రిలీజ్ లో కూడా సరికొత్త రికార్డ్ కొట్టబోతుందా..?
బాహుబలి మొదటి పార్ట్ రిలీజయి ఇటీవలే 10 ఏళ్ళు పూర్తి చేసుకుంది.

Baahubali Re Release
Baahubali Re Release : సూపర్ హిట్ సినిమా, తెలుగు సినిమా స్థాయిని పెంచేసి ఇండియన్ సినిమాని రూల్ చేసిన సినిమా బాహుబలి. రెండు పార్టులుగా వచ్చిన ఈ సినిమా భారీ హిట్ అయి కోట్ల కలెక్షన్స్ తెచ్చిన సంగతి తెలిసిందే. పార్ట్ 1 600 కోట్లకు పైగా కలెక్ట్ చేయగా, పార్ట్ 2 ఏకంగా 1800 కోట్ల గ్రాస్ వసూలు చేసి కొన్నాళ్ల పాటు బాహుబలి రికార్డుని ఎవరూ చేధించలేని విధంగా నిలబడింది ఈ సినిమా.
బాహుబలి మొదటి పార్ట్ రిలీజయి ఇటీవలే 10 ఏళ్ళు పూర్తి చేసుకుంది. మూవీ యూనిట్ కూడా రీ యూనియన్ పార్టీ చేసుకున్నారు. అలాగే బాహుబలి సినిమాని రీ రిలీజ్ కూడా చేస్తామని ప్రకటించారు. బాహుబలి రెండు పార్ధులని కలిపి 5 గంటల సినిమాగా చేసి రీ రిలీజ్ చేయనున్నారు. అక్టోబర్ 31న ఈ బాహుబలి రీ రిలీజ్ చేయనున్నారు. దీంతో ప్రభాస్ ఫ్యాన్స్ తో పాటు ప్రేక్షకులు కూడా ఈ సినిమాని రీ రిలీజ్ కోసం ఎదురు చేస్తున్నారు.
Also Read : SKY : ‘స్కై’ సినిమా టీజర్ రిలీజ్.. రాకేష్ మాస్టర్ చివరి సినిమా..
అయితే రీ రిలీజ్ లో కూడా బాహుబలి కలెక్షన్స్ భారీగా టార్గెట్ పెట్టుకుంది. పాన్ ఇండియా వైడ్ బాహుబలి రీ రిలీజ్ లో 200 కోట్లు కొట్టాలని కనీసం 100 కోట్లు అయినా దాటాలని టార్గెట్ పెట్టుకున్నట్టు తెలుస్తుంది. ఎలాగో రెండు పార్టులు కలిపి ఒకే సినిమాగా చూపిస్తున్నారు కాబట్టి కచ్చితంగా సినిమా చూడటానికి జనాలు భారీగా వస్తారు. ఏ సీన్స్ కట్ చేసారు, ఎడిటింగ్ ఎలా చేసారు, సీన్స్ కట్ చేసి రెండు కథలకు లింక్ ఎలా ఇచ్చారు అని చూడటానికి సినిమా లవర్స్ వస్తారు. ఇక ఫ్యాన్స్ ఎలాగో వస్తారు.
దీంతో బాహుబలి రీ రిలీజ్ బిజినెస్ భారీగానే జరగబోతుంది. ఇప్పటివరకు రీ రిలీజ్ అయిన సినిమాల కలెక్షన్స్ అన్ని ఒక్క రోజులోనే బద్దలు కొట్టడానికి రెడీగా ఉంది. మరి బాహుబలి రీ రిలీజ్ ఎన్ని వందల కోట్లు కలెక్ట్ చేస్తుందో చూడాలి.
Also Read : Swayambhu : బాహుబలి లాగే నిఖిల్ ‘స్వయంభు’ కూడా..