Prabhas : జపనీస్ భాషలో మాట్లాడిన ప్రభాస్.. జపాన్ ఫ్యాన్స్ కి సారీ చెప్తూ..

జపాన్ ఫ్యాన్స్ కోసం ప్రభాస్ ఒక వీడియో రిలీజ్ చేసాడు.

Prabhas : జపనీస్ భాషలో మాట్లాడిన ప్రభాస్.. జపాన్ ఫ్యాన్స్ కి సారీ చెప్తూ..

Prabhas Released a Video for Japan Fans

Updated On : December 18, 2024 / 5:50 PM IST

Prabhas : ప్రభాస్ సూపర్ హిట్ సినిమా కల్కి 2898AD ఇప్పుడు జపాన్ లో రిలీజ్ కాబోతుంది. జనవరి 3న జపాన్ లో ఈ సినిమా రిలీజ్ కానుంది. తాజాగా నేటి నుంచి కల్కి సినిమా ప్రమోషన్స్ జపాన్ లో మొదలుపెట్టారు. జపాన్ లో ప్రభాస్ కి బాహుబలి నుంచి ఫ్యాన్స్ విపరీతంగా ఏర్పడ్డారు. దీంతో అక్కడి ఫ్యాన్స్ ప్రభాస్ ఎప్పుడు జపాన్ వస్తాడా అని ఎదురుచూస్తున్నారు.

అయితే సినిమా షూటింగ్ లో ప్రభాస్ కాలికి గాయం అవ్వడంతో డైరెక్టర్ నాగ్ అశ్విన్ ఒక్కడే జపాన్ లో కల్కి ప్రమోషన్స్ కి వెళ్ళాడు. ఈ నేపథ్యంలో జపాన్ ఫ్యాన్స్ కోసం ప్రభాస్ ఒక వీడియో రిలీజ్ చేసాడు. ఈ వీడియో మొదట్లో, చివర జపాన్ భాషలో మాట్లాడాడు ప్రభాస్. మిగతా అంతా ఇంగ్లీష్ లో మాట్లాడాడు.

Also Read : Kalki – Nag Ashwin : జపాన్ లో కల్కి రిలీజ్.. ప్రమోషన్స్ లో నాగ్ అశ్విన్.. ఫొటోలు, వీడియోలు చూశారా?

ఈ వీడియోలో ప్రభాస్ మాట్లాడుతూ.. థ్యాంక్యూ సో మచ్. నా మీద నా సినిమాల మీద ప్రేమ చూపిస్తున్నందుకు థ్యాంక్యూ. కానీ మీ అందరికి సారీ చెప్తున్నాను. నేను ఎప్పట్నుంచో జపాన్ కి రావాలి అనుకుంటున్నాను. కానీ నా కాలికి గాయం అవడం వల్ల రాలేకపోతున్నాను. జపాన్ లో ఈ సినిమాని రిలీజ్ చేస్తున్న వారికి ధన్యవాదాలు. జనవరి 3 కల్కి సినిమా రిలీజ్ కాబోతుంది. త్వరలోనే నేను జపాన్ వస్తాను అని తెలిపాడు. దీంతో ప్రభాస్ జపనీస్ భాషలో కాస్త మాట్లాడటంతో ఈ వీడియో వైరల్ గా మారింది. మీరు కూడా ప్రభాస్ మాట్లాడిన వీడియో చూసేయండి..