Salaar : సలార్ అధికారిక రిలీజ్ డేట్ వచ్చేసేంది.. షారుఖ్ వర్సెస్ ప్రభాస్ ఫిక్స్..

తాజాగా సలార్ చిత్రయూనిట్ అధికారికంగా ఈ సినిమా రిలీజ్ డేట్ ని ప్రకటించారు.

Salaar : సలార్ అధికారిక రిలీజ్ డేట్ వచ్చేసేంది.. షారుఖ్ వర్సెస్ ప్రభాస్ ఫిక్స్..

Prabhas Salaar part 1 Cease Fire New Release Date Announced

Updated On : September 29, 2023 / 10:47 AM IST

Prabhas Salaar : ప్రభాస్(Prabhas) సలార్ సినిమా కోసం అభిమానులు ఎంతో ఆతృతగా ఎదురు చూస్తున్నారు. ప్రశాంత్ నీల్(Prashanth Neel) దర్శకత్వంలో ప్రభాస్ హీరోగా రెండు పార్టులుగా తెరకెక్కుతున్న సినిమా సలార్. సలార్ పార్ట్ 1 సీజ్ ఫైర్ ఇప్పటికే పలు సార్లు వాయిదా పడింది. ఈ సెప్టెంబర్ 28 కూడా అనుకున్నా ఇప్పుడు కూడా వాయిదా పడటంతో ప్రభాస్ అభిమానులు చాలా నిరాశ చెందారు.

ప్రస్తుతం సలార్ పార్ట్ 1 పోస్ట్ ప్రొడక్షన్ వర్క్స్ జరుపుకుంటుంది. ఈ పనులు పూర్తవ్వనందుకే సినిమాని వాయిదా వేశారని సమాచారం. దీంతో అభిమానులు నిరుత్సాహపడగా గత కొన్ని రోజులుగా సలార్ సినిమా డిసెంబర్ 22న రిలీజ్ అవుతుందని వైరల్ అవుతుంది. అయితే అదే రోజు షారుఖ్ డుంకి సినిమా కూడా రిలిజ్ ఉండటం, ఇంకా అధికారికంగా సలార్ చిత్రయూనిట్ ప్రకటించకపోవడంతో సలార్ రిలీజ్ డేట్ కోసం అంతా ఎదురు చూస్తున్నారు.

Image

Also Read : Skanda : రామ్ పోతినేని ‘స్కంద’ ఏ ఓటీటీలో? స్ట్రీమింగ్ ఎప్పుడు..?

తాజాగా సలార్ చిత్రయూనిట్ అధికారికంగా ఈ సినిమా రిలీజ్ డేట్ ని ప్రకటించారు. ప్రభాస సలార్ పార్ట్ 1 సీజ్ ఫైర్ సినిమాని డిసెంబర్ 22న పాన్ ఇండియా వైడ్ రిలీజ్ చేయబోతున్నట్టు ప్రకటించారు. ప్రభాస్ పోస్టర్ కూడా రిలీజ్ చేయడంతో ప్రభాస్ అభిమానులు సంతోషం వ్యక్తం చేస్తున్నారు. డిసెంబర్ లో డైనోసార్ రచ్చ చేస్తుందంటున్నారు. ఇక షారుఖ్ వర్సెస్ ప్రభాస్, సౌత్ వర్సెస్ నార్త్ అని కూడా సోషల్ మీడియాలో హంగామా చేస్తున్నారు.