Prabhas : అనుష్క కోసం ఫేవరెట్ రెసిపీ షేర్ చేసిన ప్రభాస్.. రామ్ చరణ్‌కి నెక్స్ట్ ఛాలెంజ్..

అనుష్క ఛాలెంజ్ ని స్వీకరించిన ప్రభాస్ తన ఫేవరెట్ డిష్ ఏంటో తెలియజేశాడు. అలాగే తాను రామ్ చరణ్‌కి..

Prabhas : అనుష్క కోసం ఫేవరెట్ రెసిపీ షేర్ చేసిన ప్రభాస్.. రామ్ చరణ్‌కి నెక్స్ట్ ఛాలెంజ్..

Prabhas takes Anushka MSMPrecipechallenge and forward to Ram Charan

Updated On : September 5, 2023 / 9:20 PM IST

Prabhas – Anushka : టాలీవుడ్ లో ఒక కొత్త ఛాలెంజ్ స్టార్ట్ అయ్యింది. అనుష్క శెట్టి, న‌వీన్ పొలిశెట్టి (Naveen Polishetty) కలయికలో ‘మిస్ శెట్టి మిస్టర్ పోలిశెట్టి’ (Miss Shetty Mr Polishetty) సినిమా రాబోతున్న సంగతి తెలిసిందే. ఇక ఈ మూవీ ప్రమోషన్స్ లో భాగంగా.. అనుష్క #MSMPrecipechallenge అంటూ ఛాలెంజ్ ని స్టార్ట్ చేసింది. ఈ ఛాలెంజ్ లో భాగంగా అనుష్క తన ఫేవరెట్ రెసిపీ షేర్ చేసి ప్రభాస్ ఫేవరెట్ రెసిపీ ఏంటో చెప్పమంది. అలాగే తనని కూడా ఈ ఛాలెంజ్ ని మరొకరికి ఇవ్వమని కోరింది.

Anushka – Prabhas : ప్రభాస్ ఫేవరెట్ రెసిపీ ఏంటో చెప్పమంటూ అనుష్క పోస్ట్.. డార్లింగ్ రిప్లై ఇస్తాడా..?

ఇక అనుష్క ఛాలెంజ్ ని స్వీకరించిన ప్రభాస్ తన ఫేవరెట్ డిష్ ఏంటో తెలియజేశాడు. ‘రొయ్యల పలువా’ తన ఫేవరెట్ డిష్ అంటూ అందుకు సంబంధించిన రెసిపీని షేర్ చేశాడు. ఇక ఈ ఛాలెంజ్ ని తను రామ్ చరణ్ (Ram Charan) కి ఇస్తున్నట్లు ప్రకటించాడు. మరి రామ్ చరణ్.. ప్రభాస్ ఛాలెంజ్ స్వీకరిస్తాడా..? లేదా..? చూడాలి. ప్రస్తుతం ఈ ఛాలెంజ్ టాలీవుడ్ వైరల్ అవుతుంది. దీనివల్ల తమ ఫేవరెట్ స్టార్స్ ఫేవరెట్ డిష్ లు ఏంటో తెలుస్తున్నాయి. మరి ఈ ఛాలెంజ్ ఎక్కడి వరకు వెళ్తుందో చూడాలి.

Vijay Deverakonda : ఫ్యాన్స్‌నే కాదు డిస్ట్రిబ్యూటర్స్‌ని కూడా ఆదుకోండి.. విజయ్‌కి నిర్మాణ సంస్థ కౌంటర్ ట్వీట్..!

 

View this post on Instagram

 

A post shared by Prabhas (@actorprabhas)

ఇక ‘మిస్ శెట్టి మిస్టర్ పోలిశెట్టి’ సినిమా విషయానికి వస్తే.. సెప్టెంబ‌ర్ 7న తెలుగు, తమిళ్, మలయాళ, కన్నడ భాషల్లో రిలీజ్ కాబోతుంది. కొత్త దర్శకుడు పి.మ‌హేష్ బాబు డైరెక్ట్ చేసిన ఈ మూవీలో అనుష్క చెఫ్ గా, నవీన్ స్టాండ్ అప్ కమెడియన్ గా కనిపించబోతున్నారు. రొమాంటిక్ కామెడీ ఎంటర్టైనర్ గా తెరకెక్కిన ఈ చిత్రాన్ని యువీ క్రియేష‌న్స్ బ్యాన‌ర్‌పై వంశీ, ప్ర‌మోద్‌లు నిర్మించారు.