రాధే శ్యామ్ : ప్రభాస్, జయరాం పిక్ వైరల్

Prabhas with Jayaram: రెబల్ స్టార్ ప్రభాస్, పూజా హెగ్డే నటిస్తున్న పీరియాడికల్ లవ్ స్టోరి.. ‘రాధే శ్యామ్’.. రెబల్ స్టార్ కృష్ణంరాజు గోపికృష్ణా మూవీస్ సమర్పణలో, UV Creations, TSeries సంస్థలు సంయుక్తంగా నిర్మిస్తున్నాయి.. ‘జిల్’ ఫేం రాధా కృష్ణ కుమార్ దర్శకత్వం వహిస్తున్నారు.
కృష్ణంరాజు కుమార్తె, ప్రభాస్ సోదరి ప్రసీద ఉప్పలపాటి (Praseedha Uppalapati) నిర్మాతగా పరిచయమవుతున్నారు. ఈ మూవీలో పాపులర్ మలయాళ నటుడు జయరాం కీలకపాత్రలో నటిస్తున్నారు.తాజాగా ప్రభాస్, జయరాం కలిసి ఉన్న పిక్ బయటకు వచ్చింది. జయరాం, ప్రభాస్ భుజంపై చెయ్యి వేయగా సెల్ఫీ తీసుకున్నారు. డార్లింగ్ టీ షర్ట్, క్యాప్ అండ్ గాగుల్స్‌తో స్టైలిష్‌గా ఉన్నాడు. ఇప్పుడీ ఫొటో నెట్టింట వైరల్ అవుతోంది.
ప్రస్తుతం ఇటలీలో జరుగుతున్న షూటింగ్‌తో సినిమా పూర్తవుతుంది. ఈ సినిమాకి మ్యూజిక్ : జస్టిన్ ప్రభాకరన్, సినిమాటోగ్రఫీ : మనోజ్ పరమహంస, ఎడిటింగ్ : కోటగిరి వెంకటేశ్వరరావు.