Pranayagodari : ప్రణయ గోదారి సినిమా నుంచి జానపదం ఫ్లేవర్ సాంగ్ విన్నారా..?

తాజాగా ప్రణయ గోదారి సినిమా నుంచి మరో పాటను విడుదల చేసారు.

Pranayagodari : ప్రణయ గోదారి సినిమా నుంచి జానపదం ఫ్లేవర్ సాంగ్ విన్నారా..?

Pranaya Godari Movie Song Released by Chandrabose

Updated On : September 24, 2024 / 6:58 AM IST

Pranayagodari : త్వరలో కమెడియన్ అలీ సోదరుని తనయుడు సదన్ హీరోగా పరిచయం అవుతూ ప్రణయగోదారి సినిమాతో రాబోతున్నాడు. ఇప్పటికే ఈ సినిమా నుంచి ఓ సాంగ్, గ్లింప్స్ రిలీజ్ చేయగా తాజాగా మరో పాటను విడుదల చేసారు.

చూడకయ్యో.. నెమలికళ్ళ తూగుతున్న తూనీగల్లా.. అంటూ సాగే ఈ పాట జానపదం ఫ్లేవర్ తో ఉంది. ఈ పాటని మార్కండేయ రాసి అతను అందించిన సంగీతంలో సింగర్స్ సునీత, సాయి చరణ్ లు చక్కగా పాడారు. ఈ పాటను ఆస్కార్ అవార్డు గ్రహీత, పాటల రచయిత చంద్రబోస్ చేతుల మీదుగా రిలీజ్ చేసారు. మీరు కూడా ఈ పాటను వినేయండి..

పాట రిలీజ్ చేసిన అనంతరం చంద్రబోస్ మాట్లాడుతూ.. ఈ పాటలో మంచి సాహిత్యం, సంగీతం ఉంది. ఈ పాటకు చక్కని సాహిత్యంతో పాటు మంచి స్వరకల్పన చేసారు. అందరికి అర్ధమయ్యే మాటలతో వినగానే మంచి అనుభూతి కలిగేలా ఈ పాట ఉంది. సునీత, సాయి చరణ్ లు తమ గాత్రంతో ఈ పాటకు ప్రాణం పోశారు. నాకు ఇటీవల నచ్చిన టైటిల్స్ లో ప్రణయ గోదారి ఒకటి. టైటిల్ చాలా కవితాత్మకంగా ఉంది. సినిమా కూడా అలాగే ఉంటుందని అన్నారు.

Pranaya Godari Movie Song Released by Chandrabose

 

ఇక ప్రణయ గోదారి సినిమాలో ప్రియాంక ప్రసాద్ హీరోయిన్ గా నటిస్తుండగా పిఎల్‌వి క్రియేషన్స్‌ బ్యానర్ పై పారమళ్ళ లింగయ్య నిర్మాణంలో PL విఘ్నేష్ దర్శకత్వంలో ఈ సినిమాని నిర్మిస్తున్నారు. సునీల్ రావినూతల, 30 ఇయర్స్ పృథ్వీ, సాయి కుమార్.. పలువురు నటీనటులు ఈ సినిమాలో ముఖ్య పాత్రలు పోషిస్తున్నారు.