NTR – Neel : సునామి వచ్చేముందు సైలెంట్ గానే ఉంటుంది.. ‘ఎన్టీఆర్ నీల్’ సినిమాపై నీల్ భార్య పోస్ట్ వైరల్..
దేవర షూట్ అయిపోవడంతో ఎన్టీఆర్ అప్పుడే నీల్ తో ప్రయాణం మొదలు పెట్టేసారు.

Prasanth Neel Wife shares NTR Neel Photo and gives hype on NTR 31 Movie
NTR – Neel : ఎన్టీఆర్ ‘దేవర’ తర్వాత ప్రశాంత్ నీల్ దర్శకత్వంలో ఎన్టీఆర్ 31వ సినిమా చేయబోతున్న సంగతి తెలిసిందే. ఆల్రెడీ ఈ సినిమా పూజా కార్యక్రమాలు జరగగా సినిమా ఎప్పుడు మొదలవుతుందా అని ఫ్యాన్స్ ఎదురుచూస్తున్నారు. దేవర షూట్ అయిపోవడంతో ఎన్టీఆర్ అప్పుడే నీల్ తో ప్రయాణం మొదలు పెట్టేసారు. ఎన్టీఆర్ నిన్నటి నుంచి ఫ్యామిలీతో కర్ణాటక ట్రిప్ వేసిన సంగతి తెలిసిందే.
Also Read : NTR – Neel : బీచ్‌లో ఫ్యామిలీలతో ఎంజాయ్ చేస్తున్న ఎన్టీఆర్, ప్రశాంత్ నీల్..
ఎన్టీఆర్ ఫ్యామిలీ, నీల్ ఫ్యామిలీ, రిషబ్ ఫ్యామిలీ కర్ణాటకలోని పలు ఆలయాలను, పర్యాటక ప్రదేశాలను సందర్శిస్తున్నారు. నీల్ భార్య లిఖిత నీల్ తీసే సినిమాలపై పోస్టులు పెడుతూ హైప్ ఇస్తుందని తెలిసిందే. ఈ క్రమంలో తాజాగా ఎన్టీఆర్ – నీల్ ఎక్కడో కొండల మీద నిలుచొని మాట్లాడుతుండగా ఫోటో తీసి తన ఇన్‌స్టాగ్రామ్ స్టోరీలో పోస్ట్ చేసింది లిఖిత.
ఎన్టీఆర్ – నీల్ ఫోటోని షేర్ చేసి.. సునామి వచ్చే ముందు సైలెంట్ గా ఉంటుంది అంటూ ఎన్టీఆర్ నీల్ సినిమా గురించి హైప్ ఇచ్చింది. దీంతో ఈ ఫోటో వైరల్ గా మారింది. ఇక ఈ ఫోటోని ఎన్టీఆర్ – నీల్ నిర్మాణ సంస్థ మైత్రి మూవీ మేకర్స్ షేర్ చేస్తూ.. జనతా గ్యారేజ్ చేసి 8 ఏళ్ళు అయిపొయింది. శివ – ఎన్టీఆర్ కాంబో దేవర సినిమా మరో నెలలో రాబోతుంది. ఆ తర్వాత ఎన్టీఆర్ నీల్ సినిమా షూట్ మొదలయి సునామి క్రియేట్ చేయబోతుంది అంటూ ట్వీట్ చేసారు. దీంతో ఫ్యాన్స్ ఈ ట్వీట్ ని షేర్ చేస్తున్నారు. మొత్తానికి ఎన్టీఆర్ – నీల్ సినిమాపై షూట్ మొదలు కాకముందే హైప్ పెంచుతున్నారు.
It's been 8 years for our #JanathaGarage and less than a month to go for our Dearest combo of @tarak9999 garu and Siva garu create havoc across the world with #Devara
😎😍❤️And in few months we begin the shoot of #NTRNeel to create a Tsunami 💥🔥💣 pic.twitter.com/RzuehB3FPV
— Mythri Movie Makers (@MythriOfficial) September 1, 2024