Prasanth Varma: పదిమంది హీరోయిన్లతో సినిమా.. ఏంటో అంత స్పెషల్?!

తెలుగులో డిఫరెంట్ కాన్సెప్ట్స్ తో సినిమాలు తెరకెక్కించి పేరు తెచ్చుకున్న దర్శకుల్లో ప్రశాంత్ వర్మ ఒకరు. నేచురల్ స్టార్ నాని నిర్మాతగా వ్యవహరించిన అ అనే సినిమాతో ప్రశాంత్ వర్మ తన ప్రతిభను చాటుకున్నా డు.

Prasanth Varma: పదిమంది హీరోయిన్లతో సినిమా.. ఏంటో అంత స్పెషల్?!

Prasanth Varma

Updated On : April 29, 2022 / 9:36 AM IST

Prasanth Varma: తెలుగులో డిఫరెంట్ కాన్సెప్ట్స్ తో సినిమాలు తెరకెక్కించి పేరు తెచ్చుకున్న దర్శకుల్లో ప్రశాంత్ వర్మ ఒకరు. నేచురల్ స్టార్ నాని నిర్మాతగా వ్యవహరించిన అ అనే సినిమాతో ప్రశాంత్ వర్మ తన ప్రతిభను చాటుకున్నాడు. తెలుగు తెరపై మునుపెన్నడూ చూడని విభిన్నమైన కథతో ఈ సినిమాను తెరకెక్కించాడు ప్రశాంత్ వర్మ. ఈ సినిమా మంచి టాక్ ను సొంతం చేసుకుంది. ఈ సినిమా ప్రశాంత్ విమర్శకుల ప్రశంసలు అం దుకున్నాడు.

Prasanth Varma: మరో సూపర్ హీరోను పట్టుకొస్తున్న ప్రశాంత్ వర్మ!

ఆ సినిమా తర్వాత యాంగ్రీ హీరో రాజశేఖర్ తో కల్కి అనే సినిమా చేశాడు. ఈ సినిమా ఆశించిన స్థాయిలో విజయం అందుకోలేకపోయింది. ఆతర్వాత మరో సరికొత్త జోనర్ లో యువ నటుడు తేజ సజ్జాతో జాంబీరెడ్డి సినిమాను ప్రేక్షకుల ముందుకు తీసుకువచ్చాడు. టాలీవుడ్ లో మొదటిసారి జాంబీల కథతో తెరకెక్కిన సినిమా ఇది. ఈ సినిమా మంచి విజయాన్ని అందుకుంది. కాగా ఇప్పుడు అతడు హను-మాన్ అంటూ తేజ సజ్జాతోనే తొలి తెలుగు సూపర్ హీరో సిరీస్ చేస్తున్నాడు.

Prashanth Varma : ఓ వైపు సినిమాలు.. ఓ వైపు బ్యాడ్మింటన్ లో పతకాలు.. అదరగొట్టేస్తున్న యంగ్ డైరెక్టర్

కాగా.. ఈ మూవీ అనంతరం ప్రశాంత్‌ వర్మ మరో ప్రయోగానికి సిద్ధమవుతున్నాడు. పది మంది హీరోయిన్లతో డిఫరెంట్‌ సబ్జెక్ట్‌తో కథ రెడీ చేస్తున్నట్లు సమాచారం. ఇప్పటికే ఓ హీరోయిన్‌గా అనుపమా పరమేశ్వరన్‌ను సంప్రదించగా.. ఆమె ఓకే చేయడం చకాచకా జరిగిపోయాయని తెలుస్తుంది. మిగతా హీరోయిన్స్‌ కూడా పాపులారిటీని బట్టి తీసుకోనున్నట్లు టాక్‌ వినిపిస్తుంది. త్వరలోనే ఈ చిత్రానికి సంబంధించి అధి​కారిక ప్రకటన వెలువడనుంది.