Prashanth Neel : ఎన్టీఆర్ సినిమా సెట్లో.. RCB విన్నింగ్, తన బర్త్ డే కలిపి సెలబ్రేషన్స్ చేసుకున్న డైరెక్టర్.. గంతులు వేస్తూ అరుపులతో..
తమ బెంగుళూరు RCB టీమ్ గెలవడంతో ప్రశాంత్ నీల్ సెట్ లో సందడి చేసాడు.

Prashanth Neel Celebrations for RCB Winning and his Birthday at NTR Movie Shooting Set
Prashanth Neel : ఎన్టీఆర్ ప్రస్తుతం కన్నడ డైరెక్టర్ ప్రశాంత్ నీల్ సినిమా షూటింగ్ లో బిజీగా ఉన్న సంగతి తెలిసిందే. ఈ షూటింగ్ కర్ణాటకలోని జరుగుతుంది. నిన్న షూటింగ్ అయ్యాక అక్కడ సెట్ లోనే స్క్రీన్ పెట్టించి మూవీ యూనిట్ ఐపీఎల్ మ్యాచ్ చూసారు. డైరెక్టర్ ప్రశాంత్ నీల్ కూడా కర్ణాటక కావడం, బెంగుళూరు ఫైనల్ మ్యాచ్ అవడంతో ఉత్కంఠగా మ్యాచ్ చూసారు.
ఇక తమ బెంగుళూరు RCB టీమ్ గెలవడంతో ప్రశాంత్ నీల్ సెట్ లో సందడి చేసాడు. అరుపులతో, డ్యాన్స్ స్టెప్పులతో గంతులు వేస్తూ హడావిడి చేసాడు. సెట్ లో ఉన్న మిగతా వారు కూడా RCB విజయంతో సెలబ్రేషన్స్ చేసుకున్నారు. దీంతో ఈ వీడియోలు వైరల్ గా మారాయి. ప్రశాంత్ నీల్ ఇలా చిన్నపిల్లాడిలా గంతులు వేస్తూ అరుస్తూ RCB విన్నింగ్ సెలబ్రేషన్స్ చేసుకోవడంతో ఫ్యాన్స్ సైతం ఆశ్చర్యపోతున్నారు.
ఇక నేడు జూన్ 4 ప్రశాంత్ నీల్ పుట్టిన రోజు కావడంతో నిన్న రాత్రి RCB గెలుపుతో పాటు ప్రశాంత్ నీల్ బర్త్ డే సెలబ్రేషన్స్ కూడా అక్కడే షూటింగ్ సెట్ లో చేసుకున్నారని సమాచారం. తన డైరెక్షన్ టీం, మూవీ యూనిట్ లో కొంతమందితో కలిసి ప్రశాంత్ నీల్ తన బర్త్ డే సెలబ్రేషన్స్ కూడా చేసుకున్నాడు. పలువురు సెలబ్రిటీలు, ఫ్యాన్స్, నెటిజన్లు ప్రశాంత్ నీల్ కు సోషల్ మీడియా వేదికగా నేడు శుభాకాంక్షలు తెలుపుతున్నారు.
Director #PrashanthNeel at #NTRNeel sets in RFC ❤️❤️
As King Kohli finally lifts his first IPL trophy,
the other King 👑 @tarak9999, is getting ready to create magic on screen 💥
What a great moment to witness!#RCB #IPLFinals #KingKohli #NTRNeelpic.twitter.com/0mrNRjUAPx— Milagro Movies (@MilagroMovies) June 3, 2025
Also See : Vishnupriyaa Nikhil Prithvi : నిఖిల్ – విష్ణుప్రియ -పృథ్వీ.. బిగ్ బాస్ కాంబో.. స్పెషల్ ఫొటోలు ..