Allu Arjun: ఆర్సీబీ విజయంతో అల్లు అర్జున్ కుమారుడు అయాన్ ఫుల్ ఎమోషనల్.. నెత్తిపై నీళ్లు పోసుకొని.. కింద పడుకొని ఫన్నీగా సెలబ్రేట్.. వీడియో వైరల్
18ఏళ్ల నిరీక్షణకు తెరపడింది. ఐపీఎల్ విజేతగా రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరు అవతరించింది. తమ జట్టుపై ఇన్నేళ్లు అభిమానులు పెట్టుకున్న ఆశలను నెరవేర్చింది.

Allu Arjun: 18ఏళ్ల నిరీక్షణకు తెరపడింది. ఐపీఎల్ విజేతగా రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరు అవతరించింది. తమ జట్టుపై ఇన్నేళ్లు అభిమానులు పెట్టుకున్న ఆశలను నెరవేర్చింది. ఆర్సీబీ స్టార్ ప్లేయర్ విరాట్ కోహ్లీతోపాటు మిగిలిన ఆటగాళ్లు భావోద్వేగానికి గురయ్యారు. విరాట్ కన్నీళ్లు పెట్టుకున్నాడు. మరోవైపు ఆర్సీబీ విజయంతో దేశవ్యాప్తంగా ఫ్యాన్స్ సంబరాలు అంబరాన్నంటాయి.
Also Read: IPL 2025 Final: ఫైనల్లో ఓటమి తరువాత శ్రేయాస్ అయ్యర్ కీలక కామెంట్స్.. అతని వల్లే ఓడాం..
18ఏళ్లుగా ఎదురు చూస్తున్న కల నెరవేరడంతో ఆర్సీబీ అభిమానుల ఆనందానికి అవధుల్లేకుండా పోయాయి. ఆర్సీబీ విజయంతో అభిమానులు రోడ్లపైకి వచ్చి టపాసులు కాల్చుతూ సందడి చేశారు. హైదరాబాద్ లోనూ పలు ప్రాంతాల్లో ఆర్సీబీ ఫ్యాన్స్ రోడ్లపైకి వచ్చి సంబరాలు చేసుకున్నారు. మరోవైపు.. ఆర్సీబీ విజయం సాధించిన వేళ ఐకాన్ స్టార్ అల్లు అర్జున్ తనయుడు అల్లు అయాన్ ఎమోషనల్ అయ్యాడు. ఫన్నీగా సెలబ్రేట్ చేసుకున్నాడు. ఇందుకు సంబంధించిన వీడియోను అల్లు అర్జున్ తన ఇన్ స్టాగ్రామ్ ఖాతాలో షేర్ చేశారు.
View this post on Instagram
అల్లు అర్జున్ తనయుడు అయాన్ విరాట్ కోహ్లీకి సూపర్ ఫ్యాన్. ఆర్సీబీ విజయం సాధించిన వేళ అయాన్ భావోద్వేగానికి గురయ్యాడు. ఆర్సీబీ విజయం తరువాత కిందపడుకొని తన ఆనందాన్ని తెలియజేశాడు. అనంతరం తలపై బాటిల్‌తో నీళ్లు పోసుకొని అయాన్ విభిన్నంగా తన ఆనందాన్ని వ్యక్తం చేశాడు. ఇది చూసిన బన్నీ నవ్వుతూ ఎంజాయ్ చేశారు. ఇందుకు సంబంధించిన వీడియోను షేర్ చేసిన అల్లు అర్జున్.. ఫుల్లీ ఎమోషనల్ అంటూ క్యాప్షన్ కూడా రాసుకొచ్చారు.
మరోవైపు అల్లు అర్జున్ తన ట్విటర్ ఖాతాలో ఆర్సీబీ విజయం తరువాత ఆసక్తికర పోస్టు చేశారు. ‘వేచి చూడటం ముగిసింది. ఈ సాలా కప్ నమ్దే..! ఎట్టకేలకు..! అంటూ లవ్ ఎమోజీని ఉంచారు. ఈరోజు కోసం మేము 18 సంవత్సరాలుగా ఎదురు చూస్తున్నాం. ఆర్సీబీకి పెద్ద పెద్ద అభినందనలు! అంటూ లవ్ ఎమోజీని ఉంచారు.
THE WAIT IS OVER . “Ee sala cup namde!” At last! ❤️
We’ve been waiting for this day for 18 years.
A big, big congratulations to RCB! ❤️ pic.twitter.com/2khiWPLWKV— Allu Arjun (@alluarjun) June 3, 2025