ప్రతిరోజూ పండగే మూవీ రివ్యూ

  • Published By: vamsi ,Published On : December 21, 2019 / 05:06 AM IST
ప్రతిరోజూ పండగే మూవీ రివ్యూ

Updated On : December 21, 2019 / 5:06 AM IST

బ్యానర్లు: యూవీ క్రియేషన్స్‌, జీఏ2 పిక్చర్స్‌
జానర్‌: ఫ్యామిలీ ఎంటర్‌టైనర్‌
నటీనటులు: సాయి ధరమ్‌ తేజ్‌, రాశీ ఖన్నా, సత్యరాజ్‌, రావు రమేశ్‌, విజయ్‌కుమార్‌, నరేశ్‌, ప్రభ తదితరులు
సంగీతం: థమన్‌
సినిమాటోగ్రఫీ: జయకుమార్‌
నిర్మాత: బన్నీ వాస్‌
దర్శకత్వం: మారుతి

మెగా మేనల్లుడు, సుప్రీమ్‌ హీరో సాయిధరమ్‌ తేజ్‌ హీరోగా తెరకెక్కిన సినిమా ‘ప్రతిరోజూ పండుగే’. వినూత్న కాన్సెప్ట్‌లతో కమర్షియల్‌ సినిమాలు తెరకెక్కించే దర్శకుడు మారుతీ ఒక ఫీల్‌గుడ్‌ టైటిల్‌తో తెరకెక్కించిన ఈ సినిమా శుక్రవారం ప్రేక్షకుల ముందుకు వచ్చింది. గీతా ఆర్ట్స్, యూవీ క్రియేషన్స్ వంటి పెద్ద బ్యానర్లు ఈ సినిమాను తెరకెక్కించడంతో ఫ్యాన్స్‌తో పాటు సినీ ప్రేక్షకులు దీనిపై బోలెడన్ని ఆశలు పెట్టుకున్నారు. టీజర్, ట్రైలర్స్ బాగుండడంతో సినిమాపై అంచనాలు పెరిగిపోయాయి. దాదాపు ఏడు సినిమాలు ఫ్లాప్‌లు తర్వాత చిత్రలహరి సినిమాతో ఓ హిట్ అందుకున్న ఈ మెగా మేనల్లుడుకి ఈ సినిమా ఏ రకంగా ఉపయోగపడింది. మరో హిట్ సాయి ధరమ్ తేజ్ అందుకున్నాడా? ఇప్పుడు చూద్దాం.

కథ విషయానికొస్తే.. రాజమండ్రిలో వుండే రఘురామయ్య తన పిల్లలందరూ విదేశాల్లో స్థిరపడడం తో ఒంటరిగా తన శేష జీవితాన్ని గడుపు తుంటాడు. ఆ క్రమంలో ఆయన లంగ్ క్యాన్సర్‌కు లోనవుతాడు. డాక్టర్ అయిదు వారాలకంటే ఎక్కువ బ్రతికాడు అని చెపుతారు. ఇదిలా ఉండగా అమెరికాలో వుంటున్న రఘురామయ్య పెద్ద కుమారుడు రమేష్ కు తన కుమారుడు సాయి అంటే ఎంతో ప్రాణం. ఒక్క నిమిషం కూడా సాయి లేకుండా ఉండలేడు. 

ఇలాంటి క్రమంలో తాత ఆరోగ్య పరిస్థితి విష మించిందని తెలిసి తండ్రిని వదిలేసి సాయి రాజమండ్రికి వస్తాడు. తాత చివరి రోజులను  ప్రతిరోజూ పండుగ లాగా గడవాలని కోరుకుంటాడు సాయి. మరి సాయి తన తాతను హ్యాపీగా వుంచడానికి ఎంచేసాడు….ఆ క్రమంలో అతనికి ఎదురైన సవాళ్లు ఎంటి… తాత మనవడు కథలోకి  ఎంజిల్ అర్న ఎలా వచ్చింది.. రఘురామయ్య కొడుకులు జన్మనిచ్చిన తండ్రి కోసం ఏం చేశారు అనేది సినిమా చూసి తెలుసుకోవాల్సిందే

నటి నటుల విషయానికొస్తే.. సాయి తేజ్ తన డీసెంట్ పెర్ఫార్మెన్స్ తో ఆకట్టుకున్నాడు. సినిమా అంతటా ఎనర్జిటిక్ గా కనిపించాడు. ఎమోషనల్ సీన్లలో కూడా తేజ్ నటన మెప్పించింది.రాశి ఖన్నా…తన క్యూట్ లుక్స్ తో గ్లామర్ గా కనపడింది. తనకు మంచి రోల్ దక్కింది. ఆ పాత్రకు ఆమె వందకు వంద శాతం న్యాయం చేసింది.  రావు రమేష్ తన పాత్రను అద్భుతంగా పోషించి మెప్పించాడు. పర్ఫెక్ట్ టైమింగ్ తో  హవాభావాలతో సినిమాకే హైలైట్ అనదగ్గ పాత్ర చేసాడు.సత్యరాజ్ రఘురామయ్య పాత్రలో ఇమిడి పోయాడు. ఆ పాత్రలో మరొకరిని ఊహించుకొలేని విధంగా చాలా బాగా నటించి ఆకట్టుకున్నాడు. మిగిలిన వారంతా తమ పాత్రల పరిధి మేరకు నటించి బెస్ట్ అవుట్ పుట్ ఇచ్చారు.

టెక్నీషియన్స్ విషయానికొస్తే.. అందరికీ తెలిసిన కథలనే తనదైన కామెడీ టైమింగ్ తో ఫ్యామిలీ ఎంటర్ టైనర్ గా తీర్చి దిద్దే మారుతి… మరోసారి కూడా అదే ఫార్ములాని వాడాడు ఫస్టాఫ్ అంతా బరువైన పాయింట్ తో సినిమా నడిపించి ఇంటర్వెల్ సమయానికి పాస్ మార్కులు వేయించుకున్నాడు. సెకండాఫ్ లో సినిమా అక్కడక్కడా కాస్త తగ్గినట్టు అనిపించినా కూడా ఓవరాల్ గా బాగుంది అనిపించుకున్నాడు  డైరెక్టర్ గా కామెడీ పై తనకున్న పట్టును మరోసారి నిరూపించుకున్నాడు మారుతి. 

ఇక ఇప్పటివరకు సాయి ధరమ్ తేజ్ కి కేవలం మ్యూజికల్ హిట్స్ మాత్రమే అందించిన తమన్ ఈ సినిమా కి మాంచి మ్యూజిక్ తో పాటు   బ్యాక్ గ్రౌండ్ స్కోర్ కూడా చాలా బాగుంది. సినిమాటోగ్రఫీ చాలా బాగుంది ప్రతి ఫ్రేమ్ ని చాలా కలర్ ఫుల్ గా ప్రజెంట్ చేయడంతో సినిమాకి మంచి రిచ్ లుక్ వచ్చింది. నిర్మాణ విలువలు బాగున్నాయి.

ఓవరాల్ గా చెప్పాలంటే ట్రైలర్స్ అండ్ టీజర్స్ తో మంచి ఫ్యామిలీ ఎంటర్టైనర్ అని హింట్ ఇచ్చిన ప్రతి రోజు పండగే ఫస్ట్ హాఫ్ అంతా కూడా హిలేరియస్ గా ఉండడంతో ఫుల్లుగా వర్క్ అవుట్ అయ్యింది. సెకండ్ హాఫ్ కొచ్చేసరికి  మాత్రం కాస్త ఓవర్ కామెడీ తో పాటు పాత వాసనలు ఉన్న సెంటి మెంట్ తో అక్కడక్కడా తడబడిన కూడా ఈ సినిమా బాక్సాఫీస్ దగ్గర నిలబడి పోయె అవకాశాలు ఎక్కువగా వున్నాయి.