బేబి ష‌వ‌ర్ పార్టీలో అమీ జాక్స‌న్ సంద‌డి

  • Published By: veegamteam ,Published On : August 31, 2019 / 09:40 AM IST
బేబి ష‌వ‌ర్ పార్టీలో అమీ జాక్స‌న్ సంద‌డి

Updated On : August 31, 2019 / 9:40 AM IST

బ్రిటీష్ బ్యూటి అమీ జాక్సన్‌ ప్రస్తుతం గర్భవతిగా తన ప్రయాణాన్ని చాలా సంతోషంగా గడుపుతోంది. దీనికి సంబంధించిన ఫొటోలను ఎప్పటికప్పుడు సోషల్‌ మీడియా ద్వారా అభిమానులతో పంచుకుంటున్నారు. అయితే అమీ తాజాగా ఓ పార్టీలో త‌న‌కి పుట్ట‌బోయేది ‘బేబి బాయ్’ అని కన్ఫామ్ చేసింది. 

ఇటీవల ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీతో కలిసి ‘బేబి షవర్‌’ పార్టీ జరుపుకున్నారు. ఆ పార్టీకి సంబంధించి శుక్రవారం ( ఆగస్ట్ 30, 2019)న తన ఇన్‌స్టాగ్రామ్ లో తనకు పుట్టబోయే బేబి కోసం ఎంతగానో ఎదురుచూస్తున్నట్లు తెలిపారు. బేబి కోసం రూపొందించిన ఒక చిన్న ఉయ్యాల ఫొటోను షేర్‌ చేస్తూ.. మేము నీ కోసం చాలా ఎదుచూస్తున్నాం అంటూ ఆనందం వ్యక్తం చేశారు. ఇంకో ఫొటోను షేర్‌ చేస్తూ.. పార్టీ చాలా బాగా జరిగింది. నా బాబు ఎంతో అదృష్టవవంతుడు అని పోస్ట్ చేసింది.  
 
UKకి చెందిన జార్జ్‌ పనయోట్టు అనే బిజినెస్ మ్యాన్ తో తాను డేటింగ్‌లో ఉన్నట్లు జనవరిలో తెలిపింది. ఈ ఏడాది మేలో అమీ – జార్జ్‌ల నిశ్చితార్థం జరిగింది. వచ్చే నెల అమీ డెలివరీ డేట్‌. అయితే బిడ్డ కడుపులో పడ్డాక నిశ్చితార్థం చేసుకున్న ఈ జంట తల్లిదండ్రులు అయ్యాక పెళ్లి చేసుకుంటామని తెలిపారు. 2020లో గ్రీస్ వేదిక‌గా పెళ్లి పీట‌లు ఎక్క‌నున్న‌ట్టు తెలుస్తుంది.