Telugu Serials : ప్రేమ ఎంత మధురం అను‌‌-ఆర్యల నిండు నూరేళ్ల సావాసం స్పెషల్ షో..

పిఠాపురంలో ప్రేమ ఎంత మధురం, నిండు నూరేళ్ల సావాసం సీరియల్స్ స్పెషల్ షో. ప్రసారం అప్పుడే..

Telugu Serials : ప్రేమ ఎంత మధురం అను‌‌-ఆర్యల నిండు నూరేళ్ల సావాసం స్పెషల్ షో..

Prema Entha Madhuram Nindu Noorella Saavasam serials special show

Updated On : March 7, 2024 / 5:26 PM IST

Telugu Serials : తెలుగు టీవీ సీరియల్స్ ప్రేక్షకులను ఆసక్తికరమైన మలుపులు, కథలతో ఆకట్టుకుంటున్న జీ తెలుగు ఛానల్.. ఎప్పటికప్పుడు ప్రత్యేక కార్యక్రమాలతో ఆడియన్స్ ముందుకు వస్తూ థ్రిల్ చేస్తున్నారు. తాజాగా సీరియల్ స్టార్స్ ని ప్రేక్షకుల మధ్యకు తీసుకు వెళ్లి.. వారితోనే ఓ ఎపిసోడ్ ని చిత్రీకరించారు. జీ తెలుగులో అశేషమైన ప్రేక్షకాదరణ పొందుతున్న సీరియల్స్.. ప్రేమ ఎంత మధురం, నిండు నూరేళ్ల సావాసం.

Also read : Love Me Teaser : దెయ్యంతో రొమాన్స్ ఏంటిరా బాబు.. ‘లవ్ మీ’ టీజర్ రిలీజ్..

ఈ రెండు సీరియల్స్ నటీనటులను ప్రేక్షకుల మధ్యకు తీసుకు వెళ్లి ఓ స్పెషల్ ఎపిసోడ్ ని చిత్రీకరించారు. పిఠాపురంలోని ప్రేక్షకుల మధ్య ఈ ఎపిసోడ్ ని చిత్రీకరించారు. ప్రముఖ యాంకర్ శ్యామల ఈ ఎపిసోడ్ ని నడిపించారు. ఇక ఈ స్పెషల్ ఎపిసోడ్ ని మార్చి 10 ఆదివారం మధ్యాహ్నం 12 గంటలకు జీ తెలుగులో ప్రసారం చేయబోతున్నారు.

ఈ ఎపిసోడ్ ఆద్యంతం ప్రేక్షకులకు వినోదం పంచేలా ఉంటుంది. ప్రేక్షకులతో కలిసి నటీనటులు ఆటపాటలు చేసి సంతోష పరిచారు. అంతేకాదు, సరిగమప గాయనీగాయకుల కూడా ప్రత్యేక ప్రదర్శనలు ఇచ్చి వీక్షకుల హృదయాలను ఉత్సాహపరిచారు. మరి ఈ స్పెషల్ ఎపిసోడ్ ని మీరు చూసేయండి.