The Goat Life – Aadu Jeevitham Collections : సర్వైవల్ థ్రిల్లర్స్‌తో మలయాళ సినిమాల వందల కోట్ల సునామీ.. ‘గోట్ లైఫ్’ కలెక్షన్స్ ఎంతంటే..!
సర్వైవల్ థ్రిల్లర్స్‌తో వందల కోట్ల సునామీ సృష్టిస్తున్న మలయాళ సినిమాలు. మొన్న మంజుమ్మల్ బాయ్స్. నేడు ఆడు జీవితం - ది గోట్ లైఫ్.

Prithviraj Sukumaran The Goat Life Aadu Jeevitham Movie ten days collections report
The Goat Life – Aadu Jeevitham Collections : ఒకప్పుడు మలయాళ సినిమాలు 50 కోట్లు కలెక్షన్స్ రాబట్టడమే ఒక సంచలనం. కానీ ఇప్పుడు వంద కోట్లు, రెండు వందల కోట్లతో సరికొత్త రికార్డులను సృష్టిస్తూ ముందుకు వెళ్తున్నాయి. అయితే ఇలా కలెక్షన్స్ సునామీ సృష్టిస్తున్న చిత్రాల్లో దాదాపు సర్వైవల్ థ్రిల్లర్స్ ఉండడం గమనార్హం. మలయాళ పరిశ్రమలో తెరకెక్కిన 2018, మంజుమ్మల్ బాయ్స్, ఆడు జీవితం – ది గోట్ లైఫ్.. సర్వైవల్ థ్రిల్లర్స్ గానే ఆడియన్స్ ముందుకు వచ్చాయి.
2018 మూవీ బాక్స్ ఆఫీస్ వద్ద రూ.177 కోట్లకు పైగా కలెక్షన్స్ ని అందుకుంటే, ఇటీవల వచ్చిన మంజుమ్మల్ బాయ్స్ సినిమా 230 కోట్లకు పైగా కలెక్షన్స్ ని రాబట్టింది. ఇంకా ఆ కలెక్షన్స్ కౌంట్ ని కొనసాగిస్తూనే ముందుకు తీసుకు వెళ్తుంది. ఇక రీసెంట్ గా రిలీజైన పృథ్విరాజ్ సుకుమారన్ ఆడు జీవితం – ది గోట్ లైఫ్ సినిమా కూడా సర్వైవల్ థ్రిల్లర్స్ గానే ఆడియన్స్ ముందుకు వచ్చింది.
Also read : Manjummel Boys Review : ‘మంజుమ్మల్ బాయ్స్’ తెలుగు రివ్యూ.. స్నేహం కోసం మిత్రులు చేసిన..
తాజాగా ఈ చిత్రం కూడా 100 కోట్ల మార్క్ ని క్రాస్ చేసేసింది. మార్చ్ 28న పాన్ ఇండియా వైడ్ రిలీజైన ఈ చిత్రం పది రోజుల్లోనే 100 కోట్ల మార్క్ ని క్రాస్ చేసినట్లు పృథ్వీరాజ్ సుకుమారన్ తెలియజేసారు. కాగా ఈ చిత్రానికి థియేటర్స్ వద్ద ఆదరణ ఇంకా కొనసాగుతూనే వస్తుంది. మరి ఫుల్ రన్ లో ఈ చిత్రం ఎంతటి కలెక్షన్స్ ని నమోదు చేస్తుందో చూడాలి.
100 Cr and counting at the Global Box Office! Thank you for this unprecedented success! ❤️? #Aadujeevitham #TheGoatLife @DirectorBlessy @benyamin_bh @arrahman @Amala_ams@Haitianhero @rikaby @resulp @iamkrgokul @HombaleFilms @AAFilmsIndia @PrithvirajProd @RedGiantMovies_… pic.twitter.com/6H1gynVIJ6
— Prithviraj Sukumaran (@PrithviOfficial) April 6, 2024
కాగా ఈ సినిమా కథ విషయానికి వస్తే.. కేరళకు నుంచి దుబాయ్ కి సంపాదించుకోవడం కోసం వెళ్లిన ఓ వ్యక్తి అక్కడ బానిసత్వం ఎదుర్కొంటాడు. దీంతో అక్కడి నుంచి బయటపడడం కోసం ఎడారి మార్గం నుంచి నడుస్తూ ఇండియా బయలు దేరతాడు. అతను ఇండియా వచ్చాడా..? తన ప్రయాణం ఎలా సాగింది..? అనేది కథ. ఈ సినిమా కోసం పృథ్వీరాజ్ మరియు దర్శకుడు బ్లేస్సి దాదాపు 16 ఏళ్ళకు పైగా కష్టపడ్డారు. ఈ మూవీ కోసం పృథ్వీరాజ్ తినకుండా చాలా సన్నబడ్డారు.