Priya Prakash Varrier : ప్రియ పాటకు ఫ్రెండ్స్ కోరస్..

వింక్ బ్యూటీ ప్రియ ప్రకాష్ వారియర్ సింగింగ్ టాలెంట్‌కి నెటిజన్లు ఫిదా అవుతున్నారు..

Priya Prakash Varrier : ప్రియ పాటకు ఫ్రెండ్స్ కోరస్..

Priya Prakash

Updated On : September 16, 2021 / 4:36 PM IST

Priya Prakash Varrier: కొంటెగా కన్నుగీటి కుర్రకారు హృదయాల్ని కొల్లగొట్టి ఓవర్ నైట్ స్టార్ అయిపోయింది మలయాళీ ముద్దుగుమ్మ ప్రియా ప్రకాష్ వారియర్. తెలుగులోనూ అవకాశాలు అందిపుచ్చుకుంది కానీ హీరోయిన్‌గా సక్సెస్ మాత్రం సాధించలేకపోయింది. దీంతో తన పారితోషికం తగ్గించుకుని మరీ సినిమాలు చేస్తోందీ వింక్ బ్యూటీ.

Priya Prakash : ఎక్కడ నెగ్గాలో కాదు.. ఎక్కడ తగ్గాలో తెలుసుకుంది..

షూటింగ్స్‌తో ఎంత బిజీగా ఉన్నా సోషల్ మీడియాలో మాత్రం ఎప్పుడూ యాక్టివ్‌గా ఉంటుంది ప్రియ. రీసెంట్‌గా అమ్మడు తనలోని కొత్త టాలెంట్‌ని మరోసారి బయటపెట్టి వార్తల్లో నిలిచింది. రణబీర్ కపూర్, అనుష్క శర్మ, ఐశ్యర్య రాయ్ నటించిన మ్యూజికల్ హిట్ మూవీ ‘యే దిల్ హై ముష్కిల్’ లోని ‘చెన్న మేరేయా’ పాట పాడింది ప్రియ.

Channa Mereya

 

లాస్ట్ ఇయర్ సన్నిహితులు పెళ్లికి అటెండ్ అయిన ప్రియ.. సందర్భానికి తగ్గట్టు ఈ పాటను తన గొంతుతో చాలా చక్కగా పాడింది. ఆమె పాడుతుండగా ఫ్రెండ్స్ అంతా కోరస్ అందించారు. ప్రియ ఇన్‌స్టాలో షేర్ చేసిన ఈ వీడియో మరోసారి వైరల్ అవుతోంది. ‘వావ్ ప్రియ నీలో సింగింగ్ టాలెంట్ కూడా ఉంది.. యాక్టింగ్‌తో పాటు సింగింగ్ కూడా ట్రై చెయ్’ అంటూ నెటిజన్లు కామెంట్స్ చేస్తున్నారు.

 

View this post on Instagram

 

A post shared by Priya Prakash Varrier? (@priya.p.varrier)