ఎక్కడ మొదలు పెట్టిందో అక్కడే : ప్రియా వారియర్‌ చప్పుడు లేదేంటి

  • Published By: madhu ,Published On : April 12, 2019 / 04:30 AM IST
ఎక్కడ మొదలు పెట్టిందో అక్కడే : ప్రియా వారియర్‌ చప్పుడు లేదేంటి

ఒక్క సినిమా సూపర్ హిట్టైతే చాలు..ఏ హీరోయిన్ అయినా సరే..సినిమాల మీద సినిమాలు చేస్తూనే ఉంటారు. ఒకే ఒక్క మూవీతో..బిజీయెస్ట్ హీరోయిన్ అయిపోతారు. కానీ..ఈ కేరళ కుట్టి పరిస్థితి మాత్రం రివర్స్ అయ్యింది. ఎక్కడికో వెళ్లిపోతుందని ఎక్స్ పెక్టేషన్స్ పెట్టుకుంటే.. ఎక్కడ వేసిన గొంగలి అక్కటే అన్నట్లు తయారైంది. ‘ప్రియా వారియర్’. ఒకే ఒక్కసారి కొంటెగా కన్నుగీటి.. కోట్ల మంది ఆడియన్స్ ని ఫిదా చేసిన హీరోయిన్. అంతేనా ఒకే ఒక్క సినిమాతో స్టార్ హీరోయిన్ రేంజ్ లో.. ఫ్యాన్ ఫాలోయింగ్ ని సంపాదించుకుంది. మామూలుగా అయితే..ప్రియా వారియర్‌కి వచ్చినంత క్రేజ్ మరో హీరోయిన్ కి వచ్చుంటే..ఇప్పటికే వరుస పెట్టి ఓ 10 సినిమాల్లో నటించేసేది. కానీ..ప్రియా మాత్రం..ఇంకా ఎక్కడ మొదలు పెట్టిందో అక్కడే ఉంది.
Read Also : సిగ్గు పడండి : ఓటు వేసి ఆదర్శంగా నిలిచిన గర్భిణి

మలయాళంలో ప్రియా వారియర్ నటించిన ఫస్ట్ మూవీ ‘ఒరు అదార్ లవ్’..తెలుగులో ‘లవర్స్ డే’ పేరుతో ఫిబ్రవరి 14న..ఈ సినిమా రిలీజ్ అయ్యింది. మలయాళంలో సూపర్ హిట్టైన ఈ మూవీ.. తెలుగులో పెద్దగా ఆడలేదు. దీంతో..ప్రియా పరిస్థితి ఒక్కసారిగా మారిపోయింది. మొన్నటిదాకా అడగకపోయినా అవకాశం ఇస్తాం అంటూ..ప్రియా చుట్టూ తిరిగిన ఫిల్మ్ మేకర్స్..ఇప్పుడు కన్నెత్తైనా చూడటం లేదు. దీనికితోడు..లవర్స్ డే రిలీజ్ తర్వాత..ప్రొడ్యూసర్స్, తోటి హీరోయిన్ నూరీన్ షరీఫ్‌తో విభేదాలు తలెత్తడంతో..మలయాళంలో కూడా ప్రియాకి ఛాన్స్ లు రావడంలేదని సమాచారం.

ప్రస్తుతం..ప్రియా వారియర్ చేతిలో..హిందీలో తెరకెక్కిన ‘శ్రీదేవి బంగ్లా’ సినిమా మాత్రమే ఉంది. శ్రీదేవి బంగ్లా మూవీని కూడా..మొదటి నుంచి వివాదాలు వెంటాడుతున్నాయి. సినిమా టైటిల్ పై..శ్రీదేవి భర్త బోనీ కపూర్ కేసు వేశాడు. దీంతో..సినిమా రిలీజ్ ఆగిపోయింది. మరోవైపు..ప్రియాకి యాడ్స్ కూడా పెద్దగా కలిసిరావడం లేదు. రీసెంట్ గా ఓ వాణిజ్య ప్రకటనకి సంబంధించిన ఫోటో షూట్ లో.. స్నేహ ఉల్లాల్, కృతిక కమ్ర..కుర్చీపై కూర్చుంటే ప్రియా మాత్రం కింద కూర్చుంది. దీనిపై..ఇన్స్టాగ్రామ్ లో నెటిజన్స్ థ్రోల్ చేస్తున్నారు. ఇలా..ప్రియాకి ఎందులోనూ కలిసిరావడం లేదు. 
Read Also : పెళ్లికి ముందు సెక్స్ రేప్‌ చేసినట్లే : సుప్రీంకోర్టు సంచలన తీర్పు