Priyanka Chopra : కూతురితో ప్రియాంక చోప్రా షాపింగ్.. పిక్స్ వైరల్!
ఇటీవలే తన కూతురు మాల్తీ పేస్ ని రివీల్ చేసిన ప్రియాంక.. తాజాగా మాల్తీతో కలిసి షాపింగ్ చేస్తూ సందడి చేసింది. అందుకు సంబంధించిన ఫోటోలు..

Priyanka Chopra going shopping with her daughter Malti Marie
Priyanka Chopra : స్టార్ హీరోయిన్ ప్రియాంక చోప్రా బాలీవుడ్ నుంచి హాలీవుడ్ కి వెళ్ళిపోయి అక్కడే వరుస సినిమాలు చేస్తూ సత్తా చాటుతుంది. అమెరికన్ సింగర్ మరియు నటుడు నిక్ జోనస్ ని ప్రేమించి పెళ్లి చేసుకున్న ప్రియాంక.. సరోగసీ ద్వారా ఒక ఆడపిల్లకి జన్మనించిన సంగతి తెలిసిందే. మాల్తీ మేరీ అనే పేరుని పెట్టిన ప్రియాంక చాలా కాలం తన కూతురి పేస్ బయటికి రివీల్ చేయలేదు. ఇటీవల హాలీవుడ్ లోని ఒక అవార్డు ఫంక్షన్ కి తన కూతురితో హాజరయిన ప్రియాంక మొదటిసారి మాల్తీ పేస్ ని రివీల్ చేసింది.
అప్పటిలో ఆ ఫోటోలు బాగా వైరల్ అయ్యాయి. తాజాగా ప్రియాంక తన కూతురితో కలిసి న్యూ జెర్సీలో షాపింగ్ చేసింది. మాల్తీ కావాల్సిన బొమ్మలు, ఫుడ్ ఐటమ్స్ కొనుగోలు చేసింది. అందుకు సంబంధించిన ఫోటోలను ప్రియాంక తన సోషల్ మీడియాలో షేర్ చేయగా వైరల్ అవుతున్నాయి. కాగా మాల్తీ బర్త్ విషయంలో ప్రియాంక చాలా విమర్శలు ఎదురుకుంది. అందం తగ్గుతుందనే కారణంతోనే ప్రియాంక చోప్రా సరోగసీ ద్వారా మాల్తీకి జన్మించిందని చాలా మంది కామెంట్స్ చేశారు. అయితే తనకి ఆరోగ్య సమస్యలు ఉండడం వల్ల సరోగసీకి వెళ్లినట్లు ఇటీవల ఒక ఇంటర్వ్యూలో వెల్లడించింది.
Priyanka Chopra Citadel : వరల్డ్ టాప్ వెబ్ సిరీస్‌గా ప్రియాంక సిటాడెల్.. సమంత ఏమి చేస్తుందో?
ఆ విషయం తెలుసుకోకుండా సోషల్ మీడియాలో ప్రతిఒక్కరు విమర్శలు చేయడం వలనే తన కూతురు మొఖాన్ని పరిచయం చేయలేదని చెప్పుకొచ్చింది. అంతేకాదు మాల్తీకి సరోగసీ ద్వారా జన్మనివ్వడానికి ఒప్పుకున్న వ్యక్తి పేరు వచ్చేలా తన కూతురికి పేరు పెట్టుకున్నట్లు తెలియజేసింది. ఇక ప్రియాంక సినిమాల విషయానికి వస్తే.. ఇటీవలే సిటాడెల్ (Citadel) వెబ్ సిరీస్ తో ఆడియన్స్ ముందుకు వచ్చింది. స్పై యాక్షన్ థ్రిల్లర్ గా తెరకెక్కిన ఈ సిరీస్ 6 ఎపిసోడ్స్ గా తెరకెక్కగా ఇప్పటి వరకు మూడు ఎపిసోడ్స్ రిలీజ్ అయ్యాయి.
View this post on Instagram