Priyanka Chopra : మహేష్ – రాజమౌళి షూటింగ్ షెడ్యూల్ పూర్తి.. న్యూయార్క్ వెళ్ళిపోతున్న ప్రియాంక.. పోస్ట్ వైరల్..
తాజాగా ప్రియాంక తన సోషల్ మీడియాలో ఓ పోస్ట్ పెట్టింది.

Priyanka Chopra Shares Social Media Post after Mahesh Rajamouli Movie Shooting Schedule Completed
Priyanka Chopra : ఫ్యాన్స్ ఎంతగానో ఎదురుచూస్తున్న మహేష్ బాబు – రాజమౌళి సినిమా షూటింగ్ శరవేగంగా జరుగుతున్న సంగతి తెలిసిందే. మొదటి షెడ్యూల్ హైదరాబాద్ లోని సెట్స్ లో చేయగా ఇటీవల ఒడిశా వెళ్లి అక్కడ కోరాపుట్ జిల్లా అడవుల్లో సెకండ్ షెడ్యూల్ షూట్ చేసారు. కోరాపుట్ లో జరుగుతున్న షూటింగ్ నిన్నటితో పూర్తయింది.
ఇప్పటికే షూటింగ్ పూర్తయ్యాక అక్కడి లోకల్ అధికారులు మహేష్, రాజమౌళి, ప్రియాంక చోప్రాతో దిగిన ఫోటోలు, రాజమౌళి అక్కడి యూత్ తో వాలీబాల్ ఆడిన ఫోటోలు, వీడియోలు సోషల్ మీడియాలో వైరల్ గా మారాయి. షూటింగ్ అయిపోవడంతో ప్రియాంక చోప్రా మళ్ళీ అమెరికాకు వెళ్ళిపోతుంది.
Also Read : Hema: సినిమాలకు హేమ గుడ్ బై.. కారణం ఇదే.. ఎంత గొప్ప పాత్ర వచ్చినా చేయనంటూ…
తాజాగా ప్రియాంక తన సోషల్ మీడియాలో ఓ పోస్ట్ పెట్టింది. ఈ పోస్ట్ లో పలు ఫోటోలు, వీడియోలు షేర్ చేసింది. ఒడిశా కోరాపుట్ నుంచి వైజాగ్ వరకు కార్ లో వచ్చి వైజాగ్ టు ముంబై, ముంబై టు న్యూయార్క్ వెళ్తున్నట్టు తెలిపింది. అలాగే.. దారిలో జామకాయలు అమ్మే ఒక మహిళా 150 రూపాయలు అని చెప్తే 200 ఇచ్చి చిల్లర ఉంచుకోమన్నా కూడా చిల్లర లేకపోవడంతో ఇంకొన్ని కాయలు ఇచ్చింది. వర్కింగ్ ఉమెన్ ఛారిటీగా డబ్బులు తీసుకోరు అని తెలిపింది. అలాగే ఒడిశా నుంచి వైజాగ్ దారిలో వస్తుండగా పక్కన కాలువలు, పొలాలు, రోడ్లు, షూటింగ్ సెట్ లో తీసుకున్న ఫోటోలు, వీడియోలు తన సోషల్ మీడియాలో పోస్ట్ చేసింది ప్రియాంక.
ఇప్పుడు అమెరికాకు వెళ్ళిపోయి మళ్ళీ నెక్స్ట్ షెడ్యూల్ కి రానుంది ప్రియాంక చోప్రా. మహేష్ కూడా ఇప్పటికే హైదరాబాద్ చేరుకున్నట్టు సమాచారం. కొన్ని రోజులు గ్యాప్ తీసుకొని మూడో షెడ్యూల్ ని హైదరాబాద్ లో ఓ పెద్ద సెట్ లో ప్రారంభించనున్నారు. ఈ పోస్ట్ కి మహేష్ భార్య నమ్రత.. ఈసారి నిన్ను చూడటం మిస్ అయ్యాను అని పోస్ట్ పెట్టింది.