Hema: సినిమాలకు హేమ గుడ్ బై.. కారణం ఇదే.. ఎంత గొప్ప పాత్ర వచ్చినా చేయనంటూ…
గత కొన్నాళ్లుగా హేమ సినిమాల్లో కనిపించట్లేదు.

Lady Comedian Character Artist Hema Retired from Movies
Hema : లేడీ కమెడియన్ గా, క్యారెక్టర్ ఆర్టిస్ట్ గా అనేక సినిమాలతో తెలుగు ప్రేక్షకులకు దగ్గరైంది హేమ. బిగ్ బాస్ లో కూడా పాల్గొంది. ఒక సంవత్సరం క్రితం రేవ్ పార్టీలో డ్రగ్స్ తీసుకుంది అనే ఆరోపణలతో బాగా వైరల్ అయింది. ఆ తర్వాత మూవీ ఆర్టిస్ట్ అసోసియేషన్ ఆమెని సస్పెండ్ చేయడం, రేవ్ పార్టీ కేసుతో.. వార్తల్లో నిలిచింది. అయితే గత కొన్నాళ్లుగా హేమ సినిమాల్లో కనిపించట్లేదు.
తాజాగా ఓ షాప్ ఓపెనింగ్ కి వచ్చిన హేమని సినిమాల్లో కనిపించట్లేదని ప్రశ్నించగా హేమ సమాధానమిస్తూ.. నేను సినిమాల్లో నటించడం మానేసాను. ఇప్పుడు హ్యాపీగానే ఉన్నాను. జీవితాన్ని ఎంజాయ్ చేస్తున్నాను. నాకు 14 ఏళ్ళు ఉన్నప్పటి నుంచి నేను సినిమాలు చేస్తూనే ఉన్నాను. ఇప్పటికే చాలా కష్టపడ్డాను. ఇంకెంత కాలం కష్టపడతాను. ఇప్పటికి చాలు అనిపించింది. అందుకే సినిమాలు మానేసాను. ఇకపై ఎంత మంచి పాత్ర వచ్చినా నటించను అని తెలిపింది.
Also Read : Niharika : నిహారిక నిర్మాతగా రెండో సినిమా.. ఈసారి లేడీ డైరెక్టర్ తో..
దీంతో నటి హేమ పూర్తిగా సినిమాలు మానేసినట్టే అని క్లారిటీ ఇచ్చింది. దాదాపు 200 లకు పైగా తెలుగు, తమిళ్ సినిమాల్లో క్యారెక్టర్ ఆర్టిస్ట్ గా, లేడీ కమెడియన్ గా నటించిన హేమ ఇప్పటికి తనకు అవకాశాలు వస్తున్నా సినిమాల నుంచి ఎందుకు రిటైర్మెంట్ తీసుకుందో అని సందేహిస్తున్నారు.
అయితే ఇటీవల జరిగిన రేవ్ పార్టీ సంఘటన, దాని తర్వాత జరిగిన పరిణామాలు హేమని బాగా డిస్టర్బ్ చేసాయని సమాచారం. అంతే కాకుండా మా అసోసియేషన్ నుంచి తనని సస్పెండ్ చేయడంతో హేమ చాలా ఫీల్ అయిందట. ఎలాగో ఇన్నాళ్లు సంపాదించుకుంది కాబట్టి ఇకపై సినిమాలు చేయనని తీర్మానించుకుందట హేమ. సినిమాలు మానేసినా సోషల్ మీడియాలో మాత్రం యాక్టివ్ గానే ఉంటుంది.