Niharika : నిహారిక నిర్మాతగా రెండో సినిమా.. ఈసారి లేడీ డైరెక్టర్ తో..

నిహారిక నిర్మాతగా రెండో సినిమా మొదలుపెట్టనుంది.

Niharika : నిహారిక నిర్మాతగా రెండో సినిమా.. ఈసారి లేడీ డైరెక్టర్ తో..

Mega Daughter Niharika Konidela coming with Second Theatrical Film as Producer

Updated On : March 19, 2025 / 1:38 PM IST

Niharika : మెగా డాటర్ నిహారిక కొణిదెల ఓ పక్క నటిగా సినిమాలు చేస్తూనే మరోపక్క నిర్మాతగా సిరీస్ లు, సినిమాలు నిర్మిస్తుంది. ఇప్పటికే పలు సిరీస్ లు నిర్మించిన నిహారిక ఇటీవల కమిటీ కుర్రోళ్ళు అనే సినిమాతో వచ్చి భారీ హిట్ కొట్టింది. కొత్త డైరెక్టర్, కొత్త నటీనటులతో చిన్న సినిమాగా వచ్చిన కమిటీ కుర్రోళ్ళు 50 కోట్ల వసూళ్లు సాధించి పెద్ద విజయం సాధించింది.

ఇప్పుడు నిహారిక నిర్మాతగా రెండో సినిమా మొదలుపెట్టనుంది. పింక్ ఎలిఫెంట్ పిక్చర్స్ బ్యానర్ పై నిహారిక కొణిదల నిర్మాణంలో ఫిమేల్ డైరెక్టర్ మానస శర్మతో సినిమా చేయనుంది. మానస శర్మ గతంలో పింక్ ఎలిఫెంట్ పిక్చర్స్ బ్యానర్ లోనే క్రియేటివ్ డైరెక్టర్ గా ఒక చిన్న ఫ్యామిలి స్టోరీ(జీ 5 వెబ్ సిరీస్), డైరెక్టర్ గా బెంచ్ లైఫ్(సోనీ లివ్ వెబ్ సిరీస్) చేశారు.

Also See : నవదీప్, దీక్షిత్ టచ్ మీ నాట్ సిరీస్ ట్రైలర్ చూశారా? ఇదేదో ఇంట్రెస్టింగ్ గా ఉందే..

ఇప్పుడు మానస శర్మ పింక్ ఎలిఫెంట్ పిక్చర్స్ బ్యానర్ లో 3వ ప్రాజెక్టు గా ఫీచర్ ఫిల్మ్ చేస్తుంది. నిర్మాతగా నిహారికకు ఇది రెండో థియేట్రికల్ సినిమా. మొదటి సినిమాతోనే భారీ హిట్ కొట్టిన నిహారిక రెండో సినిమాతో ఎలా మెప్పిస్తుందో చూడాలి. త్వరలోనే ఈ సినిమా గురించి మరిన్ని వివరాలు తెలిపి అధికారికంగా ప్రకటించనున్నారు.