Market Mahalakshmi : సినిమాలో మెయిన్ పాయింట్‌ని దాచి సినిమాని ప్రమోట్ చేస్తున్నాం.. మార్కెట్ మహాలక్ష్మి..

మార్కెట్ మహాలక్ష్మి మూవీ మెయిన్ పాయింట్‌ని దాచిపెట్టి నిర్మాతలు సినిమాని ప్రమోట్ చేస్తున్నారట.

Market Mahalakshmi : సినిమాలో మెయిన్ పాయింట్‌ని దాచి సినిమాని ప్రమోట్ చేస్తున్నాం.. మార్కెట్ మహాలక్ష్మి..

Producer Akhilesh Kalaru about Parvateesam Market Mahalakshmi movie

Market Mahalakshmi : పార్వతీశం, ప్రణీకాన్వికా జంటగా బి2పి స్టూడియోస్ బ్యానర్ పై అఖిలేష్ కలారు నిర్మాణంలో కొత్త దర్శకుడు VS ముఖేష్ దర్శకత్వంలో తెరకెక్కిన సినిమా ‘మార్కెట్ మహాలక్ష్మి’. సాఫ్ట్ వేర్ జాబ్ అబ్బాయి మార్కెట్ లో కూరగాయలు అమ్ముకునే అమ్మాయిని ప్రేమించే కాన్సెప్ట్ తో ఈ సినిమా రాబోతుంది. మార్కెట్ మహాలక్ష్మి సినిమా ఏప్రిల్ 19న థియేటర్స్ లో రిలీజ్ కానుంది. తాజాగా ప్రమోషన్స్ లో భాగంగా ఈ సినిమా నిర్మాత అఖిలేష్ కలారు మీడియాతో ముచ్చటించారు.

అఖిలేష్ కలారు మాట్లాడుతూ.. నేను అమెరికాలో సాఫ్ట్ వేర్ ఇంజనీర్ గా చేస్తున్నాను. చిన్నప్పటి నుంచి సినిమాలు అంటే ఇష్టం. కానీ ఇంట్లో బాధ్యతల వల్ల ఇన్నాళ్లు కష్టపడి ఆ బాధ్యతలు పూర్తిచేసి ఇప్పుడు నాకు ఇష్టమైన సినిమాల్లోకి వచ్చాను. ముఖేష్ రెండేళ్లుగా తెలుసు. అతను చెప్పిన మార్కెట్ మహాలక్ష్మి పాయింట్ నాకు నచ్చి నిర్మాతగా చేయడానికి ఒప్పుకున్నాను అని తెలిపారు.

Also read : Samyuktha Menon : నిస్సహాయులైన మహిళల కోసం ‘ఆదిశక్తి’గా మారుతున్న సంయుక్త మీనన్..

ఇక మార్కెట్ మహాలక్ష్మి గురించి మాట్లాడుతూ.. ఇది చాలా సింపుల్ కథ. ఓ ఇండిపెండెంట్ అమ్మాయి, సాఫ్ట్‌వేర్ అబ్బాయి మధ్య సాగే ప్రేమకథ. కానీ సినిమాలో ఇంకో మెయిన్ పాయింట్ ఉంది. అది మేము ప్రమోషన్స్ లో దాస్తున్నాము. సినిమా రిలీజ్ అయ్యాక ఆ పాయింట్ ఆడియన్స్ ని థ్రిల్ చేస్తుంది. నేను అమెరికాలోనే ఉంటూ ఇక్కడ సినిమాని నిర్మించాను. సినిమాలో నటించిన హీరో & హీరోయిన్ పార్వతీశం, ప్రణీకాన్వికలతో సహా అందరూ బాగా నటించారు. నాకు మొదట చెప్పిన కథనే ఫైనల్ గా సినిమా చూపించాడు డైరెక్టర్. నేను పెట్టిన డబ్బులు ఈ సినిమా ద్వారా నాకు తిరిగి వస్తాయి, ప్రాఫిట్స్ కూడా వస్తాయి. మా మార్కెట్ మహాలక్ష్మి సినిమాతో పాటు ఈ వారం రిలీజయ్యే అన్ని సినిమాలు హిట్ అవ్వాలి అని అన్నారు.