Naga Vamsi – Pawan Kalyan : ఇలాంటి టైంలో పవన్ కళ్యాణ్ తో సినిమాలు చేయాలని కోరుకోకూడదు.. స్టార్ నిర్మాత వ్యాఖ్యలు..

తాజాగా సితార ఎంటర్టైన్మెంట్స్ అధినేత, నిర్మాత నాగవంశీ పవన్ కళ్యాణ్ తో సినిమా అంటే ఆసక్తికర విషయాలు తెలిపారు.

Naga Vamsi – Pawan Kalyan : ఇలాంటి టైంలో పవన్ కళ్యాణ్ తో సినిమాలు చేయాలని కోరుకోకూడదు.. స్టార్ నిర్మాత వ్యాఖ్యలు..

Producer Naga Vamsi Interesting Comments on Pawan Kalyan Movies

Updated On : March 22, 2025 / 2:16 PM IST

Naga Vamsi – Pawan Kalyan : పవన్ ప్రస్తుతం ఏపీలో ఉపముఖ్యమంత్రిగా బిజీగా ఉన్న సంగతి తెలిసిందే. చేతిలో ఉన్న హరిహర వీరమల్లు, OG సినిమాలు ఎలా అయినా పూర్తి చేయలని ప్రయత్నిస్తున్నా ఆయన బిజీ వల్ల డేట్స్ ఇవ్వలేకపోతున్నారు. ఈ రెండు సినిమాలు చేసిన తర్వాత పవన్ పూర్తిగా సినిమాలు ఆపేస్తారని అందరూ ఫిక్స్ అయిపోయారు. దీంతో నిర్మాతలు, దర్శకులు పవన్ ఇకపై సినిమాలు చేయడు కాబట్టి ఆయనతో సినిమా ప్లానింగ్ పెట్టుకోవట్లేదు.

తాజాగా సితార ఎంటర్టైన్మెంట్స్ అధినేత, నిర్మాత నాగవంశీ పవన్ కళ్యాణ్ తో సినిమా అంటే ఆసక్తికర విషయాలు తెలిపారు. మ్యాడ్ స్క్వేర్ సినిమా ప్రమోషన్స్ లో భాగంగా ఓ ఇంటర్వ్యూలో మీ సితార సంస్థలో 50వ సినిమా వరకు వస్తే ఎన్టీఆర్, పవన్ కళ్యాణ్ ఇద్దరిలో ఎవరితో 50వ సినిమా చేస్తారు అని అడిగారు.

Also Read : Kaalamega Karigindhi : ‘కాలమేగా కరిగింది’ మూవీ రివ్యూ.. అచ్చ తెలుగులో తొలి ప్రేమ కథ..

దీనికి నాగవంశీ సమాధానమిస్తూ.. పవన్ కళ్యాణ్ గారితో ఇప్పుడు సినిమా చేయాలని కోరుకోకూడదు. ఆయన రాష్ట్రానికి ఏం చేస్తారు? దేశానికి ఏం చేస్తారు అని కోరుకోవాలి. ఆయన పెద్ద పెద్ద పొజిషన్స్ లోకి వెళ్లాలి పాలిటిక్స్ లో అని కోరుకోవాలి. అంతే కానీ ఆయనతో సినిమా తీయాలని కోరుకోకూడదు. కాబట్టి ఎన్టీఆర్ తోనే 50వ సినిమా తీస్తా అనుకుంట అన్నారు. దీంతో నాగవంశీ వ్యాఖ్యలు వైరల్ గా మారాయి. అయితే నాగవంశీ చెప్పింది నిజమే అని ఫ్యాన్స్ కూడా భావిస్తున్నారు.