K Niranjan Reddy : ‘హనుమాన్’ 100 రోజుల వేడుకలు.. ఫస్ట్ సినిమా అయినా బడ్జెట్ విషయంలో ధైర్యంగా నిలబడ్డ నిర్మాత..

హనుమాన్ సినిమా కలెక్షన్స్, థియేటర్స్, రన్నింగ్ డేస్.. ఇలా అన్ని విషయాల్లోనూ రికార్డులు సెట్ చేసింది.

K Niranjan Reddy : ‘హనుమాన్’ 100 రోజుల వేడుకలు.. ఫస్ట్ సినిమా అయినా బడ్జెట్ విషయంలో ధైర్యంగా నిలబడ్డ నిర్మాత..

Producer Niranjan Reddy gets Huge Success with his First Movie Hanuman

Updated On : April 23, 2024 / 1:51 PM IST

K Niranjan Reddy : తేజ సజ్జ(Teja Sajja) హీరోగా ప్రశాంత్ వర్మ(Prashanth Varma) దర్శకత్వంలో హనుమంతుడి రిఫరెన్స్ తో సూపర్ హీరో సినిమాగా సంక్రాంతికి వచ్చిన ‘హనుమాన్’(Hanuman) సినిమా భారీ విజయం సాధించిన సంగతి తెలిసిందే. ఈ సినిమాని ప్రైమ్ షో ఎంటర్టైన్మెంట్ బ్యానర్ పై K నిరంజన్ రెడ్డి ఈ సినిమాని నిర్మించారు. హనుమాన్ సినిమా కలెక్షన్స్, థియేటర్స్, రన్నింగ్ డేస్.. ఇలా అన్ని విషయాల్లోనూ రికార్డులు సెట్ చేసింది.

ఎవరూ ఊహించని విధంగా హనుమాన్ సినిమా 300 కోట్లకు పైగా గ్రాస్ కలెక్షన్స్ వసూలు చేసి 300 సెంటర్స్ లో 30 రోజులు, 150 సెంటర్స్ లో 50 రోజులు, 25 సెంటర్స్ లో 100 రోజులు ఆడి ఈ రోజుల్లో కూడా ఇలాంటి రికార్డులని సృష్టించింది. అయిత్ ఈ సినిమాని వెనక ఉండి నడిపించింది, ప్రశాంత్ వర్మని, అతని కాన్సెప్ట్ ని నమ్మి నిలబడింది నిర్మాత K నిరంజన్ రెడ్డి.

ప్రైమ్‌ షో ఎంటర్‌టైన్‌మెంట్‌ అనే బ్యానర్ స్థాపించి మొదటి సినిమాతోనే ఈ రేంజ్ హిట్ కొట్టారు కె.నిరంజన్ రెడ్డి. చాలా క్వాలీటీగా ప్రశాంత్ వర్మ అనుకున్నది అనుకున్నట్టు సినిమా రావడానికి అనుకున్న 15 కోట్ల బడ్జెట్ కాస్త 65 కోట్లు అయినా ఎక్కడా తడబడకుండా ధైర్యంగా నిలబడి, కథని నమ్మి నిర్మించారు. తేజ సజ్జ లాంటి ఇప్పుడిప్పుడే ఎదుగుతున్న హీరో మీద నిర్మాతగా మొదటి సినిమాకే ఇంత బడ్జెట్ పెట్టడానికి గట్స్ ఉండాలి. రిస్క్ తీసుకొని ఈ సినిమా నిర్మించిన నిరంజన్ రెడ్డి అదే రిస్క్ తీసుకొని హిట్ అవుతుందనే నమ్మకంతో స్టార్ హీరోలు బరిలో ఉన్నా సంక్రాంతికి భారీగా సినిమాని రిలీజ్ చేసి పెద్ద హిట్ కొట్టారు.

Also Read : Vijay Deverakonda : పెళ్లి వేడుకలో కత్తి పట్టిన విజయ్ దేవరకొండ.. పర్సనల్ గార్డ్ పెళ్ళికి ఫ్యామిలీతో కలిసి..

తాజాగా హనుమాన్ సినిమా నిన్నటితో 100 రోజులు పూర్తిచేసుకోవడంతో నేడు స్పెషల్ ఈవెంట్ కూడా నిర్వహిస్తున్నారు. మొదటి సినిమాతోనే ఇంత భారీ సక్సెస్ కొట్టడంతో టాలీవుడ్ లో నిర్మాత నిరంజన్ రెడ్డి చర్చగా మారారు. ఇటీవలే తమ రెండో సినిమా ప్రియదర్శి, నభా నటేష్ కాంబోలో డార్లింగ్ సినిమాని ప్రకటించారు. ఈ సినిమాపై కూడా మంచి అంచనాలు ఉన్నాయి.