Producer SKN : మెగా ఫ్యాన్స్ మధ్య గొడవలు పెడుతున్నారు.. భోళా శంకర్ మనమే నిలబెట్టుకోలేపోయాం..

చిరంజీవి పుట్టిన రోజు వేడుకల్ని అభిమానులు గ్రాండ్ గా నిర్వహించారు. ఈ వేడుకలకు పలుకవురు సినీ ప్రముఖులు హాజరయ్యారు. ఇక ఈ వేడుకల్లో నిర్మాత SKN ఎప్పటిలాగే స్టేజిపై ఓ రేంజ్ లో మాట్లాడారు.

Producer SKN : మెగా ఫ్యాన్స్ మధ్య గొడవలు పెడుతున్నారు.. భోళా శంకర్ మనమే నిలబెట్టుకోలేపోయాం..

Producer SKN speech in Megastar Chiranjeevi Birthday Celebrations goes viral

Producer SKN : మెగాస్టార్ చిరంజీవి(Megastar Chiranjeevi) ఇటీవల భోళా శంకర్(Bholaa Shankar) సినిమాతో ప్రెకషకుల ముందుకి వచ్చారు. ఈ సినిమా అభిమానులని, ప్రేక్షకులని మెప్పించలేక డిజాస్టర్ అయింది. ఈ సినిమా ఫ్లాప్ అవ్వడంతో చాలా మంది డైరెక్టర్ తో పాటు చిరంజీవిని కూడా విమర్శించారు. ఇక ఈ సినిమా పరాజయాన్ని అభిమానులు జీర్ణించుకోలేకపోయారు. కానీ ఇలాంటి ఫ్లాప్స్ ఎన్ని వచ్చినా ఆయన రేంజ్ తగ్గదని అందరికి తెలిసిందే.

తాజాగా చిరంజీవి పుట్టిన రోజు వేడుకల్ని అభిమానులు గ్రాండ్ గా నిర్వహించారు. ఈ వేడుకలకు పలుకవురు సినీ ప్రముఖులు హాజరయ్యారు. ఇక ఈ వేడుకల్లో నిర్మాత SKN ఎప్పటిలాగే స్టేజిపై ఓ రేంజ్ లో మాట్లాడారు. ఇటీవలే బేబీ సినిమాతో SKN భారీ విజయం సాధించిన సంగతి తెలిసిందే. ఇక SKN మెగాస్టార్ కి వీరాభిమాని అని ఇప్పటికే అనేకసార్లు చెప్పాడు.

Vijay Devarakonda – Rashmika : విజయ్ దేవరకొండ రష్మిక కాంబోలో మరో సినిమా.. మళ్ళీ ఎప్పుడు? ఛాన్స్ ఉందా?

చిరంజీవి పుట్టిన రోజు వేడుకల్లో SKN మాట్లాడుతూ.. ఒక సినిమా నచ్చకపోయినా దాన్ని తొక్కేసేది కూడా మనమే. సినిమా అలా ఉంది, ఇలా అంది అని మనమే కామెంట్స్ చేస్తాం. ఇప్పుడు హీరోలకి పోటీగా చిరంజీవి గారు ఈ ఏజ్ లో కూడా మన కోసం నటిస్తున్నారు. ఈ మధ్య చిరు రీ ఎంట్రీ తర్వాత వచ్చిన సినిమాల్లో చాలా గ్లామర్ గా కనపడింది భోళా శంకర్ సినిమాలోనే. దాన్ని కూడా మనం నిలబెట్టుకోలేకపోయాం అంటే అది మన తప్పే. మనల్ని వేరే వాళ్ళు వలలో పడేలా చేశారు. బాస్ రీమేక్ సినిమా చేయాలా, స్ట్రైట్ సినిమా చేయాలా అని ఎవడో చెప్తాడు, ఎవడో చెప్తే మనం నమ్మాలా. బాస్ కి తెలుసు ఎలాంటి సినిమా చేయాలో. మోకాలికి ఆపరేషన్ చేయించుకొని కూడా మన కోసం డ్యాన్సులు వేస్తున్నారు. బాస్ వెంటే మనం అంతా ఉండాలి. సోషల్ మీడియాలో మెగా ఫ్యాన్స్ అంతా యూనిటీగా ఉండండి. మనం యూనిటీగా ఉంటే మనల్ని ఎవ్వడూ కొట్టలేడు. కొంతమంది సోషల్ మీడియాలో మెగా ఫ్యాన్స్ మధ్య గొడవలు పెడుతున్నారు. అలాంటి వాటితో మనం చాలా జాగ్రత్తగా ఉండాలి. మన సినిమా అప్పుడప్పుడు యావరేజ్ అవుతాయి. హిట్లర్ సినిమా ముందు బాస్ పని అయిపొయింది అన్నారు, ఖైదీ 150 ముందు అలాగే అన్నారు కానీ ప్రతిసారి తిరిగి వస్తున్నారు. బాస్ ని ప్రమోట్ చేయడానికి ఛానల్స్, పేపర్లు లేవు. ఆయనకి ఉన్నది మనమే. భోళా శంకర్ సినిమాని ఎవరు తొక్కలనుకున్నారో తెలుసు. మనం మళ్ళీ హిట్ కొడతాం అని అన్నారు. దీంతో SKN చేసిన వ్యాఖ్యలు సంచలనంగా మారాయి.