Unstoppable : భీమ్లా నాయక్‌లో పవన్ కళ్యాణ్ బదులు ఫస్ట్ అనుకున్న హీరో ఎవరో తెలుసా.. అన్‌స్టాపబుల్ షోలో బయటపెట్టిన నిర్మాత..

షోలో నిర్మాత నాగవంశీ ఓ సీక్రెట్ ని బయటపెట్టారు. బాలయ్య భీమ్లా నాయక్‌ సినిమాలో మొదట పవన్ కళ్యాణ్ బదులు ఎవరు అనుకున్నారు అని నిర్మాతని అడిగాడు. వంశీ మాట్లాడుతూ...........

Unstoppable : భీమ్లా నాయక్‌లో పవన్ కళ్యాణ్ బదులు ఫస్ట్ అనుకున్న హీరో ఎవరో తెలుసా.. అన్‌స్టాపబుల్ షోలో బయటపెట్టిన నిర్మాత..

producer vamshi reveals secret about bheemla nayak movie in Unstoppable Show

Updated On : October 21, 2022 / 12:46 PM IST

Unstoppable :  బాలకృష్ణ హోస్ట్ గా ఆహాలో చేసిన అన్‌స్టాపబుల్ షో సీజన్ 2ని ఇటీవల మొదలైంది. అన్‌స్టాపబుల్ సీజన్ 2లో మొదటి ఎపిసోడ్ కి చంద్రబాబు నాయుడు, లోకేష్ వచ్చి అందర్నీ ఆశ్చర్యపరిచారు. దీంతో సీజన్ 2 మొదటి ఎపిసోడ్ వ్యూస్ లో సరికొత్త రికార్డుని సృష్టించింది. ఇక అన్‌స్టాపబుల్ సీజన్ 2 రెండో ఎపిసోడ్ లో యువ హీరోలు సిద్ధు జొన్నలగడ్డ, విశ్వక్‌సేన్ వచ్చారు. ప్రస్తుతం ఫుల్ ఫామ్ లో ఉన్న ఈ హీరోలు రావడంతో ఈ ఎపిసోడ్ కూడా బాగా క్లిక్ అవుతుంది. ఈ ఎపిసోడ్ కి సితార ఎంటర్టైన్మెంట్స్ నిర్మాత సూర్యదేవర నాగవంశీ కూడా వచ్చారు. యువ హీరోలతో కలిసి బాలయ్య బాబు రచ్చ చేశారు. వాళ్ళతో కలిసి సరదాగా మాట్లాడుతూ సెటైర్స్ వేస్తూ ఎంటర్టైన్ చేశారు.

Vishwaksen : నా సేవింగ్స్ అయిపోయాయి.. ఇల్లు తాకట్టు పెట్టి సినిమా తీస్తున్నా.. అక్కేమో హాస్పిటల్ లో ఉంది..

ఈ షోలో నిర్మాత నాగవంశీ ఓ సీక్రెట్ ని బయటపెట్టారు. బాలయ్య భీమ్లా నాయక్‌ సినిమాలో మొదట పవన్ కళ్యాణ్ బదులు ఎవరు అనుకున్నారు అని నిర్మాతని అడిగాడు. వంశీ మాట్లాడుతూ.. ”ముందు మీ చుట్టే తిరిగాము. పవన్ కళ్యాణ్ గారి పాత్రని మిమ్మల్నే చేయమని అడిగాము. మీరు చేయనున్నారు. మీరే కళ్యాణ్ గారి పేరు చెప్పారు. ఈ పాత్రకి కళ్యాణ్ అయితే సరిపోతాడని అన్నారు” అని తెలిపారు. దీంతో భీమ్లా నాయక్‌ సినిమాలో పవన్ కళ్యాణ్ పాత్రకి ముందు బాలకృష్ణని హీరోగా అనుకున్నారని తెలియడంతో ఆశ్చర్యపోతున్నారు ప్రేక్షకులు.