Matka : మట్కా కోసం నాకు ఇష్టంలేని పనులు కూడా పిఆర్ఓలు చేయించారు.. వరుణ్ తేజ్ కామెంట్స్..

Matka : మట్కా కోసం నాకు ఇష్టంలేని పనులు కూడా పిఆర్ఓలు చేయించారు.. వరుణ్ తేజ్ కామెంట్స్..

PROs also did things I didnt like for Matka Varun Tej shocking comments

Updated On : November 12, 2024 / 6:15 PM IST

Matka : మెగా ప్రిన్స్ వరుణ్ తేజ్ హీరోగా నటించిన లేటెస్ట్ సినిమా మట్కా. కరుణ కుమార దర్శకత్వంలో వస్తున్న ఈ సినిమా నవంబర్ 14న విడుదల కానుంది. ఇక విడుదల సమయం దగ్గర పడుతుంటంతో ప్రమోషన్స్ సైతం జోరోగా చేస్తున్నారు. ఇప్పటికే ఈ సినిమాకి సంబందించిన ప్రీ రిలీజ్ ఈవెంట్ కూడా వైజాగ్ లో నిర్వహించారు మేకర్స్.

ప్రమోషన్స్ లో భాగంగా వరుస ఇంటర్వూస్ ఇస్తున్నాడు వరుణ్ తేజ్.. తాజాగా ఓ ఇంటర్వ్యూలో పాల్గొన్న ఆయన కొన్ని పనులు ఇష్టం లేకపోయినా పిఆర్ఓలు చేయిస్తారు అని షాకింగ్ కామెంట్స్ చేశారు. ఇంటర్వ్యూ లో యాంకర్.. సినిమా మొత్తంలో మీ ప్రమేయం ఎలా ఉందని అడిగితే.. నిజానికి అందరు డైరెక్టర్స్ ఒకేలా ఉండరు. కొందరు డైరెక్టర్స్ ఎక్కువ మాట్లాడరు. కానీ కొందరు ఎక్కువ మాట్లాడి ఎక్కువ పని చేయించుకుంటారు. కొన్ని సినిమాల్లో నేను చెయ్యడానికి ఏమి ఉండదు.. కానీ అన్ని సినిమాలు అలా కాదు. మట్కా విషయంలో అలా కాదు డైరెక్టర్ నాతో ఓపెన్ అప్ అయ్యి అన్ని చెప్పారని వరుణ్ తెలిపారు.

Also Read : Bigg Boss Telugu 8 : బిగ్ బాస్ హౌస్ లో ఫ్యామిలీ వీక్.. పేరెంట్స్ ని చూసి ఎమోషనల్ అయిన హౌస్ మేట్స్..

అలాగే కొన్ని విషయాలు మాత్రం మనం ఎంత చేయొద్దు అనుకున్నా, మనకి ఇష్టం లేకపోయినా పిఆర్ఓలు చేయిస్తారు. నిజానికి నేను చాలా తక్కువ మాట్లాడతా, ఎక్కువ గట్టిగా, ఎక్కువ మాట్లాడడం నాకు ఇష్టం ఉండదు. అయినా పిఆర్ఓలు మాత్రం స్టేజ్ పైకి వెళ్లి గట్టిగా, ఎక్కువ సేపు మాట్లాడాలి, అన్ని ఇంటర్వూస్ కి వెళ్ళాలి అని చెప్తుంటారు. సినిమాని ఎక్కువ ప్రమోట్ చెయ్యాలని, ఎక్కువ డైలాగ్స్ చెప్పాలని చెప్తారు. కానీ ఏం చేస్తాం చెయ్యక తప్పదు అని వరుణ్ ఈ ఇంటర్వ్యూ లో పేర్కొన్నారు.