Prudhvi Raj : హాస్పిటల్ బెడ్ పై నటుడు పృథ్వీరాజ్ వీడియో వైరల్.. పిఆర్ నుంచి వివరణ!
నటుడు పృథ్వీరాజ్ అస్వస్థతకు గురై ఒక్కసారిగా కుప్పకూలిపోయాడు అంటూ ప్రముఖ మీడియా వెబ్ సైట్స్ వార్తలు రాసుకొచ్చాయి. అయితే దీని పై క్లారిటీ కోసం 10TV ప్రతినిధి పృథ్వీరాజ్ పిఆర్ ని సంప్రదించగా..

Prudhvi Raj health is perfectly alright viral video is old
Prudhvi Raj : టాలీవుడ్ లో 30 ఇయర్స్ ఇండస్ట్రీగా మంచి గుర్తింపు సంపాదించుకున్న నటుడు పృథ్వీరాజ్. క్యారెక్టర్ ఆర్టిస్ట్ గా, కమెడియన్ గా ఆడియన్స్ ని అలరిస్తూ వస్తున్న పృథ్వీరాజ్.. ఇప్పుడు మెగా ఫోన్ పట్టుకొని దర్శకుడిగా ఒక సినిమా తెరకెక్కిస్తున్నాడు. ‘కొత్త రంగుల ప్రపంచం’ అనే టైటిల్ తో ఆ చిత్రాన్ని తెరకెక్కిస్తున్నాడు. ఇక ఈ మూవీ ప్రమోషన్స్ భాగంగా బిజీబిజీగా ఉంటున్న పృథ్వీరాజ్.. అస్వస్థతకు గురై ఒక్కసారిగా కుప్పకూలిపోయాడు అంటూ ప్రముఖ మీడియా వెబ్ సైట్స్ వార్తలు రాసుకొచ్చాయి.
Game Changer : గేమ్ ఛేంజర్ క్లైమాక్స్ షూట్ కంప్లీట్.. వైరలవుతున్న డైరెక్టర్ శంకర్ పోస్ట్..
వాటితో పాటు ఒక వీడియోని కూడా షేర్ చేశారు. ఆ వీడియోలో పృథ్వీరాజ్ హాస్పిటల్ బెడ్ పై సెలైన్‌తో కనిపిస్తున్నాడు. తన ఆరోగ్యం కోలుకుంటుందని, తన సినిమాని ప్రేక్షకులు అంతా ఆదరించాలని పృథ్వీ ఆ వీడియోలో పేర్కొన్నాడు. ఇక ఆ వీడియో వైరల్ అవ్వడంతో అభిమానులు, ఇండస్ట్రీ వ్యక్తులు పృథ్వీరాజ్ కి ఏమైందంటూ అరా తీస్తున్నారు. అయితే ఈ విషయం పై క్లారిటీ కోసం 10TV ప్రతినిధి పృథ్వీరాజ్ పిఆర్ ని సంప్రదించగా ఆ వార్తలో నిజం లేదని తెలియజేశారు.
NTR 100 Years : అన్నేసి పాత్రలు.. అంతే కాక డైరెక్టర్, ప్రొడ్యూసర్, రైటర్.. ఆ సినిమాలకు అన్నీ ఆయనే..
అది పాత వీడియో అని, ప్రస్తుతం పృథ్వీరాజ్ ఆరోగ్యం బాగానే ఉందని, ఆఫీస్ లో ఆయన వర్క్ చేసుకుంటున్నారని తెలియజేశాడు. దీంతో ఆయన ఆరోగ్యం పై వస్తున్న వార్తల్లో నిజం లేదని తెలిసిపోయింది. కాగా ఇటీవల శరత్ బాబు ఆరోగ్యం విషయంలో కూడా పలు మీడియా వెబ్ సైట్స్ అసలు విషయం తెలుసుకోకుండా అసత్య వార్తలు ప్రచారం చేశారు.