Puneeth Rajkumar : నందమూరి కుటుంబంతో పునీత్ అనుబంధం..

సీనియర్ ఎన్టీఆర్ - రాజ్ కుమార్ నుండి జూనియర్ ఎన్టీఆర్ - పునీత్ రాజ్ కుమార్‌‌ల వరకు.. ఇరు కుటుంబాల మధ్య మూడు తరాలుగా మంచి అనుబంధముంది..

Puneeth Rajkumar : నందమూరి కుటుంబంతో పునీత్ అనుబంధం..

Puneeth Rajkumar Bonding

Updated On : October 29, 2021 / 6:59 PM IST

Puneeth Rajkumar: కన్నడ కంఠీరవ రాజ్ కుమార్ నట వారసుడు, కరునాడ చక్రవర్తి శివ రాజ్ కుమార్ సోదరుడు.. పవర్‌స్టార్ పునీత్ రాజ్ కుమార్ గుండెపోటుతో కన్నుమూశారు. ఆయన వయసు 46 సంవత్సరాలు. పునీత్‌కు భార్య అశ్విని రేవంత్, కుమార్తెలు ధృతి, వందిత ఉన్నారు.

Puneeth Rajkumar : పునీత్ రాజ్ కుమార్ కన్నుమూత.. శోకసంద్రంలో శాండల్‌వుడ్..

రాజ్ కుమార్‌ కుంటుంబానికీ, నందమూరి ఫ్యామిలీకీ మధ్య మంచి రిలేషన్ ఉంది. సీనియర్ ఎన్టీఆర్ – రాజ్ కుమార్ నుండి జూనియర్ ఎన్టీఆర్ – పునీత్ రాజ్ కుమార్‌‌ల వరకు మూడు తరాలుగా వీరిది విలువైన బంధం.

Puneeth Rajkumar : అప్పుడు అన్న.. ఇప్పుడు తమ్ముడు..

సీనియర్ ఎన్టీఆర్ – రాజ్ కుమార్ సోదరుల్లా మెలిగారు. వారి తర్వాత వారి వారసులు నందమూరి బాలకృష్ణ – శివ రాజ్ కుమార్, వారి తర్వాత జూనియర్ ఎన్టీఆర్ – పునీత్ రాజ్ కుమార్‌ల మధ్య మంచి బాండింగ్ ఉంది. బాలయ్య 100వ సినిమా ‘గౌతమి పుత్ర శాతకర్ణి’ లో శాతకర్ణి జీవిత చరిత్రను వివరించే పాటలో కనిపించి తెలుగు ప్రేక్షకులను ఆకట్టుకున్నారు శివన్న.

Puneeth Rajkumar: జూనియర్ ఎన్టీఆర్‌తోనే కాదు.. సీనియర్ ఎన్టీఆర్‌తోనూ పునీత్‌కు అనుబంధం.. ఎలాగో తెలుసా..?

శివ రాజ్ కుమార్ సినిమాల ఫంక్షన్లకు బెంగుళూరు వెళ్లి కన్నడలో మాట్లాడి తమ్ముడిని బ్లెస్ చేశారు బాలయ్య. పునీత్ రాజ్ కుమార్ నటించిన ‘చక్రవూహ్య’ సినిమాలో యంగ్ టైగర్ ఎన్టీఆర్ ‘గెలయా గెలయా’ అనే కన్నడ పాట పాడి సెన్సేషన్ క్రియేట్ చేశారు. వీరి అభిమానుల మధ్య కూడా మంచి అనుబంధం ఉంది.

Puneeth Rajkumar : వయసులో చిన్న.. వ్యక్తిత్వంలో మిన్న.. కళ్లు దానం చేసిన పునీత్ రాజ్ కుమార్..

పునీత్ మరణవార్త విన్న నందమూరి కుటుంబ షాక్ గురైంది. హిందూపురంలో ఎమ్మెల్యే బాలకృష్ణ ఆదేశాల మేరకు పునీత్ రాజ్ కుమార్ చిత్రపటానికి పూలు వేసి నివాళులు అర్పించారు బాలకృష్ణ మరియు జూనియర్ ఎన్టీఆర్ అభిమానులు. పునీత్ మృతికి సంతాపం తెలియజెయ్యడానికి, ఆ కుటుంబానికి తమ ప్రగాఢ సానుభూతిని తెలియజెయ్యడానికి బాలయ్య – తారక్ బెంగుళూరు వెళ్తున్నారు.

Nbk Fans