Puneeth Rajkumar : పునీత్ రాజ్‌కుమార్ విగ్రహం తయారీ తెనాలిలో.. నవంబర్ 1న కర్ణాటకలో ఆవిష్కరణ..

పునీత్ రాజ్‌కుమార్ విగ్రహాన్ని కూడా ఈ వేడుకలలో భాగంగా ఆవిష్కరించనున్నారు. పునీత్ రాజ్‌కుమార్ 21 అడుగుల ఫైబర్ విగ్రహాన్ని మన తెనాలిలోని తయారు చేయించారు. తెనాలికి చెందిన శిల్పులు...........

Puneeth Rajkumar : పునీత్ రాజ్‌కుమార్ విగ్రహం తయారీ తెనాలిలో.. నవంబర్ 1న కర్ణాటకలో ఆవిష్కరణ..

Puneeth Rajkumar idol designed in tenali

Updated On : October 29, 2022 / 11:14 AM IST

Puneeth Rajkumar :  కన్నడ స్టార్ హీరో పునీత్ రాజ్‌కుమార్‌ గత సంవత్సరం గుండెపోటుతో అకస్మాత్తుగా మరణించిన సంగతి తెలిసిందే. ఆయన మరణించి నేటికి సంవత్సరం అయింది. ఆయన మరణం కన్నడ ప్రజలకి, సినీ పరిశ్రమకి తీరని లోటుని మిగిల్చింది. హీరోగానే కాక ఎన్నో సేవా కార్యక్రమాలతో ప్రజలకి దగ్గరయ్యారు పునీత్ రాజ్‌కుమార్‌. దీంతో ఆయన మరణం అక్కడి ప్రజలని ఎంతో కలవరపరిచింది. నేటికీ ఆయన సమాధి వద్దకు ఎంతోమంది ప్రజలు, ప్రముఖులు వచ్చి నివాళులు అర్పిస్తున్నారు.

గతంలో కర్ణాటక ప్రభుత్వం పునీత్ రాజ్‌కుమార్ కి కర్ణాటక అత్యున్నత అవార్డు ‘కర్ణాటక రత్న’ ప్రకటించారు. పునీత్ మొదటి వర్థంతి సందర్భంగా, అలాగే నవంబర్ 1న కర్ణాటక రాజ్యోత్సవం సందర్భంగా ఈ కర్ణాటక రత్న అవార్డుని కర్ణాటక ప్రభుత్వం పునీత్ రాజ్‌కుమార్‌ కుటుంబ సభ్యులకి అందచేయనున్నారు. ఈ మేరకు ఓ భారీ బహిరంగ సభని కూడా నిర్వహించనున్నారు. దీనికి అధిక సంఖ్యలో పునీత్ అభిమానులు హాజరు కానున్నారు. ఈ అవార్డు అందచేసే కార్యక్రమానికి అతిధులుగా చాలా మంది సినీ ప్రముఖులు హాజరవనున్నారు. ముఖ్యంగా ఎన్టీఆర్, రజినీకాంత్ కూడా ఈ కార్యక్రమానికి హాజరు కానున్నట్టు సమాచారం.

Puneeth Rajkumar : పునీత్ రాజ్‌కుమార్‌కి కర్ణాటక రాష్ట్ర అవార్డు.. అతిధులుగా ఎన్టీఆర్, రజినీకాంత్..

అలాగే పునీత్ రాజ్‌కుమార్ విగ్రహాన్ని కూడా ఈ వేడుకలలో భాగంగా ఆవిష్కరించనున్నారు. పునీత్ రాజ్‌కుమార్ 21 అడుగుల ఫైబర్ విగ్రహాన్ని మన తెనాలిలోని తయారు చేయించారు. తెనాలికి చెందిన శిల్పులు కాటూరి వెంకటేశ్వరరావు, రవిచంద్ర, శ్రీహర్ష కలిసి ఈ భారీ విగ్రహాన్ని రెడీ చేశారు. 21 అడుగుల ఎత్తులో 3డీ టెక్నాలజీతో ఈ విగ్రహాన్ని తయారు చేసినట్లు తెలుస్తోంది. ప్రస్తుతం తెనాలిలోని సూర్య శిల్పశాల వద్ద పునీత్ ఫైబర్ విగ్రహాన్ని ప్రదర్శనగా ఉంచారు. నవంబర్ 1 లోపు ఈ విగ్రహాన్ని బెంగుళూరుకి తరలించనున్నారు.