Puri Jagannadh : పూరి జగన్నాధ్ చేతుల మీదుగా.. ఏంటో అంతా సరికొత్తగా..
ఈ సినిమా ఫస్ట్ లుక్ పోస్టర్‌ను డేరింగ్ అండ్ డాషింగ్ డైరెక్టర్ పూరి జగన్నాథ్ రిలీజ్ చేశారు. (Puri Jagannadh)
 
                            Puri Jagannadh
Puri Jagannadh : రాము ప్రొడక్షన్స్ బ్యానర్ పై రాము.ఎం నిర్మాణంలో రాజ్ బోను దర్శకత్వంలో తెరకెక్కుతున్న సినిమా ‘ఏంటో అంతా సరికొత్తగా’. శ్రీరామ్ నిమ్మల, హర్షిత జంటగా ఈ సినిమా తెరకెక్కుతుంది. నేడు ఈ సినిమా ఫస్ట్ లుక్ పోస్టర్‌ను డేరింగ్ అండ్ డాషింగ్ డైరెక్టర్ పూరి జగన్నాథ్ రిలీజ్ చేశారు.
‘ఏంటో అంతా సరికొత్తగా’ టైటిల్‌కు తగ్గట్టు అందమైన గ్రామీణ ప్రేమ కథతో పాటు, గ్రామీణ వాతావరణం, టోల్ గేట్ వద్ద జరిగే సంఘటనలతో ఈ సినిమా కథ ఉండనుంది. ఫస్ట్ లుక్ పోస్టర్ ఆహ్లాదంగా, కూల్‌గా కనిపిస్తోంది.
Also Read : Chiranjeevi : ‘రన్ ఫర్ యూనిటీ’ ప్రోగ్రాంలో పాల్గొన్న మెగాస్టార్.. ఫోటోలు చూశారా?

పూరి జగన్నాధ్ పోస్టర్ రిలీజ్ చేసిన అనంతరం మూవీ యూనిట్ మాట్లాడుతూ.. పల్లెటూరి వాతావరణం, ప్రశాంతత నేపథ్యంలో చాలా కూల్‌గా, ఆహ్లాదకరంగా సాగే ఓ అపురూపమైన ప్రేమ కథగా ఏంటో అంతా సరికొత్తగా సినిమా రానుంది. షూటింగ్ పూర్తయింది. ప్రస్తుతం పోస్ట్ ప్రొడక్షన్ పనులు జరుగుతున్నాయి. త్వరలోనే ఈ సినిమా రిలీజ్ డేట్‌ను ప్రకటిస్తాము అని తెలిపారు.






