Producer Koteswara Rao : ‘గోకులంలో సీత’ చూసి పవన్ కళ్యాణ్ కి ఫ్యాన్ అయిపోయి.. పురుషః నిర్మాత ఆసక్తికర వ్యాఖ్యలు..
మూవీ ప్రమోషన్స్‌లో భాగంగా నిర్మాత బత్తుల కోటేశ్వరరావు నేడు మీడియాతో మాట్లాడారు. (Producer Koteswara Rao)
Producer Koteswara Rao
Producer Koteswara Rao : పవన్ కళ్యాణ్, సప్తగిరి, కసిరెడ్డి రాజ్ కుమార్, రాయంచ కొక్కుర, విషిక, హాసిని సుధీర్ ముఖ్య పాత్రల్లో తెరకెక్కుతున్న సినిమా పురుషః. కళ్యాణ్ ప్రొడక్షన్స్ బ్యానర్ పై బత్తుల సరస్వతి సమర్పణలో బత్తుల కోటేశ్వరరావు నిర్మాణంలో వీరు వులవల దర్శకత్వంలో ఈ సినిమా తెరకెక్కింది. పురుషః సినిమా మే 22న రిలీజ్ కానుంది. ఈ క్రమంలో మూవీ ప్రమోషన్స్‌లో భాగంగా నిర్మాత బత్తుల కోటేశ్వరరావు నేడు మీడియాతో మాట్లాడారు.
ఆయన గురించి చెప్తూ.. మాది గుంటూరు జిల్లా కారంపూడి. సినిమా ఫీల్డుతో ఎలాంటి సంబంధం లేదు. కానీ నేను ఎక్కువగా సినిమాలు చూస్తాను. ‘గోకులంలో సీత’ సినిమా చూసిన తరువాత పవన్ కళ్యాణ్ గొప్ప స్థాయికి వెళ్తారని అనిపించింది. అప్పట్నుంచి నేను ఆయనకు అభిమాని అయ్యా. నాకు కొడుకు పుడితే ఆయన పేరే పెట్టుకోవాలని అనుకున్నా. అలా తమ్ముడు సినిమా టైంలో మాకు అబ్బాయి పుట్టడంతో పవన్ కళ్యాణ్ అనే పేరు పెట్టా. మా అబ్బాయికి సిగ్గు, బిడియం ఎక్కువ. అవి పోవాలని మా అబ్బాయిని హీరో చేశాను. అలాగే నాకు సినిమా ఫీల్డ్ మీద ఉన్న ఆసక్తి కూడా నెరవేరుతుంది.
Also Read : Nayanthara : భర్త,పిల్లలతో కలిసి వెకేషన్ ఎంజాయ్ చేస్తున్న నయనతార.. క్యూట్ ఫొటోలు..
పురుషః సినిమా గురించి మాట్లాడుతూ.. దర్శకుడు వీరు కంటే ముందు వేరే వాళ్ళతో సినిమా అనుకున్నాం కానీ కుదరలేదు. వీరు చెప్పిన కథ నాకు బాగా నచ్చింది. పురుష: కథ చాలా బాగుంటుంది. ఆయన నెరేషన్ కూడా చాలా డిఫరెంట్‌గా ఉంది. ఇందులోని లవ్ స్టోరీ నాకు చాలా నచ్చింది. వీటీవీ గణేష్, వెన్నెల కిషోర్, సప్తగిరి.. ఇలా సినిమాలో చాలా మంది స్టార్స్ ఉన్నారు. వాళ్ళందరూ డేట్స్ టైంకి ఇచ్చి మాకు సహకరించారు. మా అబ్బాయి ఎలా నటించాడు అనేది సినిమా చూసిన తరువాత ఆడియెన్స్ చెప్పాలి. ఇందులో ఫుల్ కామెడీ ఉంటుంది. ఒక బ్రెజిల్ అమ్మాయి కూడా నటించింది. తనదే సినిమాని మలుపు తిప్పే పాత్ర అని అన్నారు.
పురుష: రిలీజ్ గురించి మాట్లాడుతూ.. ఈ సినిమాని దాదాపు మూడు వందల థియేటర్లలో రిలీజ్ చేస్తున్నాం. ఓవర్సీస్ లో కూడా రిలీజ్ చేస్తున్నాం. మే 21న ప్రీమియర్స్ కూడా వేస్తున్నాం. ఓటీటీ డీల్స్ వచ్చినా అమ్మలేదు. సినిమా రిలీజ్ అయ్యాకే అమ్ముదామని ఆగాము అని తెలిపారు.
Also Read : Mouni Roy : విడాకుల తర్వాత మొదటిసారి.. కాన్స్ ఫిలిం ఫెస్టివల్ లో మౌనీరాయ్.. ఫొటోలు..
తన తర్వాతై సినిమాల గురించి మాట్లాడుతూ..మా అబ్బాయితోనే చేస్తాను. నేను ముందుగానే మా అబ్బాయితో మూడు సినిమాలు చేస్తానని చెప్పను. అప్పటి వరకు మా వాడు నిరూపించుకుని హీరోగా నిలబడితే ఓకే. లేదంటే మళ్లీ మా ఊరికి వచ్చి వ్యవసాయం చేయాలని ముందే చెప్పాను అని తెలిపారు.
