Pushpa 2 : పుష్పరాజ్‌ చిటికెన వేలు గోరు.. నెట్టింట చర్చ..

పుష్ప 2 కి సంబంధించిన ఒక క్రేజీ న్యూస్ నెట్టింట తెగ వైరల్ అవుతుంది. అదేంటంటే.. 'పుష్పరాజ్‌ చిటికెన వేలు గోరు' కథ.

Pushpa 2 : పుష్పరాజ్‌ చిటికెన వేలు గోరు.. నెట్టింట చర్చ..

Pushpa 2 Allu Arjun finger nail stories gone viral

Pushpa 2 : సుకుమార్ (Sukumar) దర్శకత్వంలో ఐకాన్ స్టార్ అల్లు అర్జున్ (Allu Arjun) నటిస్తున్న పుష్ప 2 పై అభిమానుల్లో ఏ రేంజ్ అంచనాలు ఉన్నాయో ప్రత్యేకంగా చెప్పనవసరం లేదు. ఈ క్రేజ్ తోనే ఈ మూవీ పై ఎక్కువ ఆసక్తి చూపిస్తూ ఉంటారు. దీంతో ఈ మూవీ పై సోషల్ మీడియాలో అనేక వార్తలు పుట్టుకొస్తూ ఉంటాయి. తాజాగా ఈ మూవీకి సంబంధించిన ఒక క్రేజీ న్యూస్ నెట్టింట తెగ వైరల్ అవుతుంది. అదేంటంటే.. ‘పుష్పరాజ్‌ చిటికెన వేలు గోరు’ కథ.

Hanuaman : ‘హనుమాన్’ అప్డేట్ ఇచ్చిన ప్రశాంత్ వర్మ.. వినాయక చవితి నుంచి..

ఈ మూవీని వచ్చే ఏడాది 2024 ఆగష్టు 15న పుష్ప 2 సినిమా రిలీజ్ చేయబోతున్నట్టు అనౌన్స్ చేస్తూ చిత్ర యూనిట్ ఒక పోస్టర్ రిలీజ్ చేసిన విషయం అందరికి తెలిసిందే. అయితే ఆ పోస్టర్ లో అల్లు అర్జున్ మొఖం చూపించకుండా చెయ్యి, చిటికెన వేలు గోరుని హైలైట్ చేస్తూ చూపించారు. అంతకుముందు మూవీ టీజర్ ని రిలీజ్ చేసినప్పుడు కూడా అల్లు అర్జున్ చిటికెన వేలు గోరు ప్రత్యేకంగా ఆకట్టుకుంది. దీంతో ఈ గోరు వెనుక ఒక కథ ఉంది అంటూ సోషల్ మీడియాలో కొన్ని కథలు పుట్టుకొస్తున్నాయి.

Jawan Collections : బాక్సాఫీస్ వద్ద తగ్గుతున్న జవాన్ కలెక్షన్స్.. 1000 కోట్లు కష్టమేనా..?

సమాజంలో తమ స్థాయిని చూపించుకోవడానికి కొన్ని సంస్కృతుల్లో అలా చిటికెన వేలు గోరును పెంచుకుంటారు. అది వారిని నలుగురికి సంపన్నులుగా పరిచయం చేస్తుందని కొందరు చెబుతుంటే, మరి కొందరు.. రాజ్యాన్ని పాలించే అర్హత తమకే ఉందని చెప్పడానికి కూడా అలా గోరును పెంచుతారని కామెంట్స్ చేస్తున్నారు. అయితే ఇంకొందరు మాత్రం.. పుష్పరాజ్‌ ఎర్రచందనం వ్యాపారాన్ని తన చిటికెన వేలుతో నడిపిస్తాడని సూచిస్తూ సుకుమార్ అలా హైలైట్ చేసి ఉండవచ్చు అని అభిప్రాయం వ్యక్తం చేస్తున్నారు. అసలు సుకుమార్ అలా ఎందుకు డిజైన్ చేశాడో తెలియదుగాని, నెటిజెన్స్ చెప్పే వెర్షన్స్ మాత్రం ఆకట్టుకుంటున్నాయి.