Pushpa 2: బ్లాస్టింగ్ న్యూస్.. పుష్ప రాజ్ రాకకు ముహూర్తం ఫిక్స్!
ఐకాన్ స్టార్ అల్లు అర్జున్ నటించిన ‘పుష్ప-ది రైజ్’ బాక్సాఫీస్ వద్ద ఎలాంటి సెన్సేషన్ క్రియేట్ చేసిందో అందరికీ తెలిసిందే. ఈ సినిమాకు సంబంధించి రెండో పార్ట్ ఉంటుందని చిత్ర యూనిట్ గతంలోనే ప్రకటించింది. కాగా, తాజాగా ‘పుష్ప-2’ సినిమాకు సంబంధించి బన్నీ అండ్ టీమ్ సాలిడ్ అప్డేట్ ఇచ్చింది.

Pushpa 2 Pooja Ceremony To Be Held On August 22
Pushpa 2: ఐకాన్ స్టార్ అల్లు అర్జున్ నటించిన ‘పుష్ప-ది రైజ్’ బాక్సాఫీస్ వద్ద ఎలాంటి సెన్సేషన్ క్రియేట్ చేసిందో అందరికీ తెలిసిందే. ఈ సినిమాను క్రియేటివ్ డైరెక్టర్ సుకుమార్ తెరకెక్కించిన తీరు ప్రేక్షకులను అమితంగా ఆకట్టుకోవడంలో సక్సెస్ అయ్యింది. ఇక పాన్ ఇండియా మూవీగా ఈ సినిమాను రిలీజ్ చేయగా, పుష్ప చిత్రం బాక్సాఫీస్ వద్ద చెడుగుడు ఆడేసింది. ఈ సినిమాలో బన్నీ పవర్‌ప్యాక్డ్ పర్ఫార్మెన్స్‌కు యావత్ ప్రేక్షకులు ఫిదా అయ్యారు.
Pushpa 2: పుష్ప 2 కోసం స్ట్రగుల్ ఫేస్ చేస్తున్న సుకుమార్?
ఫలితంగా ‘పుష్ప – ది రైజ్’ ఇండియావైడ్‌గా బ్లాక్‌బస్టర్ సక్సెస్ అందుకుంది. ఈ సినిమాకు సంబంధించి రెండో పార్ట్ ఉంటుందని చిత్ర యూనిట్ గతంలోనే ప్రకటించింది. దీంతో ఈ సినిమా రెండో పార్ట్ ఎప్పుడెప్పుడు ప్రారంభిస్తారా అని అందరూ ఆసక్తిగా ఎదురుచూస్తున్నారు. కాగా, తాజాగా ‘పుష్ప-2’ సినిమాకు సంబంధించి బన్నీ అండ్ టీమ్ సాలిడ్ అప్డేట్ ఇచ్చింది. ఈ సినిమాకు సంబంధించిన పూజా కార్యక్రమం ఆగస్టు 22న నిర్వహిస్తున్నట్లు చిత్ర యూనిట్ ప్రకటించింది. దీంతో ‘పుష్ప – ది రూల్’ మూవీ ప్రస్తుతం సోషల్ మీడియాలో ట్రెండింగ్ అవుతోంది.
Pushpa 2: సినిమా మొదలే కాలేదు.. రూ.600 కోట్ల ప్రీ రిలీజ్ బిజినెస్?
ఇక సుకుమార్ ఈ రెండో భాగాన్ని అత్యంత ప్రతిష్టాత్మకంగా తెరకెక్కించేందుకు రెడీ అవుతుండగా, ఈ సినిమాకు సంగీతాన్ని మరోసారి దేవిశ్రీ ప్రసాద్ అందిస్తుండటంతో పుష్ప-2 కోసం ప్రేక్షకుల్లో అదిరిపోయే అంచనాలు క్రియేట్ అయ్యాయి. మైత్రీ మూవీ మేకర్స్ బ్యానర్ ఈ సినిమాను అత్యంత భారీ బడ్జెట్‌తో ప్రొడ్యూస్ చేస్తుండటంతో ఈసారి పుష్పరాజ్ మరింత గ్రాండియర్‌గా రాబోతున్నాడని చిత్ర యూనిట్ తెలిపింది. ఈ సినిమాలో అందాల భామ రష్మిక మందన హీరోయిన్‌గా నటించగా, ఫహాద్ ఫాజిల్ ముఖ్య పాత్రలో నటిస్తున్నాడు.
#PushpaRaj is back!
This time to Rule ?#PushpaTheRule Pooja Ceremony tomorrow?India’s most anticipated sequel is going to be BIGGER ❤️?
Icon Star @alluarjun @iamRashmika @ThisIsDSP @aryasukku pic.twitter.com/791FhTOlC5
— Mythri Movie Makers (@MythriOfficial) August 21, 2022