Pushpa 2: సినిమా మొదలే కాలేదు.. రూ.600 కోట్ల ప్రీ రిలీజ్ బిజినెస్?

ఐకాన్ స్టార్ అల్లు అర్జున్, సుకుమార్ దర్శకత్వంలో వచ్చిన పాన్ ఇండియా మూవీ పుష్ప పార్ట్ 1 ఏ స్థాయిలో సక్సెస్ అందుకుందో అందరికీ తెలిసిందే. అయితే, అనుకోకుండా నేషనల్ వైడ్ క్రేజ్ దక్కించుకుంది పుష్ప.

Pushpa 2: సినిమా మొదలే కాలేదు.. రూ.600 కోట్ల ప్రీ రిలీజ్ బిజినెస్?

Pushpa 2

Pushpa 2: ఐకాన్ స్టార్ అల్లు అర్జున్, సుకుమార్ దర్శకత్వంలో వచ్చిన పాన్ ఇండియా మూవీ పుష్ప పార్ట్ 1 ఏ స్థాయిలో సక్సెస్ అందుకుందో అందరికీ తెలిసిందే. అయితే, అనుకోకుండా నేషనల్ వైడ్ క్రేజ్ దక్కించుకుంది పుష్ప. సడెన్ గా ఐకాన్ స్టార్ నార్త్ ఆడియెన్స్ ను బాగా సర్ ప్రైజ్ చేయడంతోనే ఈ స్థాయి సక్సెస్ దక్కింది. ప్రమోషన్స్ చేసింది లేదు… పెద్దగా అంచనాలూ లేవు. అయినా సరే పుష్పరాజ్ ను నార్త్ ఆడియెన్స్ విపరీతంగా ఓన్ చేసుకున్నారు. ఎలాగూ సౌత్ లో బన్నీకున్న క్రేజ్ తో పుష్ప ది రైజ్ ఇక్కడా సక్సెస్ కొట్టింది.

Pushpa 2: సుక్కూ కథలో మార్పులు.. పుష్పరాజ్ కోసం మరో హీరోయిన్?

ఫస్ట్ పార్ట్ ఊహించని సక్సెస్ తో ఇప్పుడు పుష్ప 2పై ఎక్స్ పెక్టేషన్స్ అమాంతం పెరిగాయి. బాహుబలి 2, కేజీఎఫ్2 లాంటి సీక్వెల్స్ దక్కిన ఆదరణ ఎలాంటిదో తెలిసిందే. ఇప్పుడు అదే స్థాయిలో పుష్ప 2పై అంచనాలు పెరిగిపోయాయి. సో సెకండ్ పార్ట్ ని పుష్పరాజ్ ఎలా రూల్ చేస్తాడా అన్న ఇంట్రెస్ట్ ప్రేక్షకుల్లో పెరిగింది. అందుకే ఆ అంచనాలను మించేలా పుష్ప2 తీసుకురాబోతున్నారు మేకర్స్. ఇక ఈ అంచనాలకు తగ్గట్లే ఈ సినిమా బిజినెస్ కూడా మొదలైనట్లు కొద్దిరోజులుగా విపరీతంగా గాసిప్స్ వస్తున్న సంగతి తెలిసిందే.

Pushpa 2: సుక్కూ చెక్కుడు.. పుష్పరాజ్ రాకకు ఇంకాస్త టైమ్ పడుతుందా?

పుష్ప 2 కోసం ఇప్పటికే నాన్ థియేట్రికల్ రైట్స్ కి గాను రూ. 300 కోట్లకి పైగా డీల్ వస్తున్నాయని బజ్ వినిపించగా.. ఇప్పుడు డిజిటల్ రైట్స్ కలిపి రూ. 500 నుంచి రూ.600 కోట్లకి పైగా బిజినెస్ ఆఫర్స్ వస్తున్నట్లు ప్రచారం జరుగుతుంది. మరి ఇది ఎంతమేర నిజమో తెలియదు కానీ.. అసలు ఇంకా సినిమా కూడా మొదలు కాకుండానే ఈ స్థాయిలో బిజినెస్ జరుగుపుకోవడం అంటే మాములు విషయం కాదు. అదే ఇక ఈ సినిమా కూడా అంచనాలను అందుకొని బ్లాక్ బస్టర్ కొడితే బన్నీ, సుకుమార్ స్థాయి ఏ రేంజ్ లో ఉంటుందో ఊహించడం కూడా కష్టమే!