PV Sindhu : మా చుట్టాలంతా సినిమా వాళ్ళే.. సినిమా వాళ్ళని పెళ్లి చేసుకోవాలనే ఆశలు లేవు..

లింపిక్‌ మెడల్, ఎన్నో పతకాలు, ఇటీవలే కామన్వెల్త్ గేమ్స్ లో గోల్డ్ మెడల్ సాధించిన భారత స్టార్‌ షట్లర్‌ పీవీ సింధు తాజాగా అలీతో సరదాగా టాక్ షోకి వచ్చింది. ఈ టాక్ షోలో సినిమా, ఆటలు, తన పర్సనల్ లైఫ్ గురించి పలు ఆసక్తికర విషయాలని.................

PV Sindhu : మా చుట్టాలంతా సినిమా వాళ్ళే.. సినిమా వాళ్ళని పెళ్లి చేసుకోవాలనే ఆశలు లేవు..

PV Sindhu spoke about her marriage

Updated On : August 24, 2022 / 8:56 AM IST

 

PV Sindhu :  ఒలింపిక్‌ మెడల్, ఎన్నో పతకాలు, ఇటీవలే కామన్వెల్త్ గేమ్స్ లో గోల్డ్ మెడల్ సాధించిన భారత స్టార్‌ షట్లర్‌ పీవీ సింధు తాజాగా అలీతో సరదాగా టాక్ షోకి వచ్చింది. ఈ టాక్ షోలో సినిమా, ఆటలు, తన పర్సనల్ లైఫ్ గురించి పలు ఆసక్తికర విషయాలని షేర్ చేసుకుంది సింధు.

ప్రభాస్ అంటే ఇష్టమని, భవిష్య్తతులో సినిమాల్లోకి రావొచ్చేమో అని, తన బయోపిక్ ఉండొచ్చు అని తెలిపింది సింధు. ఇక సినిమా పరిశ్రమలో చాలా మంది చుట్టాలు ఉన్నారని తెలిపింది. సింధు తాతయ్య దోనేపూడి బ్రహ్మయ్య ఎన్టీఆర్‌తో బందిపోటు, కలవారి సంసారం సినిమాలు, మరి కొన్ని సినిమాలు నిర్మాతగా తీశారని, ఇక ప్రముఖ నిర్మాత అశ్వినీదత్‌ గారు సింధుకి అమ్మ తరుఫున బంధువు అవుతారని చెప్పింది. ఇంకా కొంతమంది సినిమా వాళ్ళు చుట్టాలు ఉన్నారంది. ఆటల్లో గెలవడం వల్ల సినిమా వాళ్ళు కూడా బాగా క్లోజ్ అయ్యారని తెలిపింది సింధు.

Amitabh Bachchan : మరోసారి కరోనా బారిన పడ్డ అమితాబ్.. నాకు కరోనా వచ్చింది అంటూ ట్విట్టర్లో పోస్ట్ చేసిన బిగ్ బి

ఇక పెళ్లి గురించి అడిగితే.. ఇప్పట్లో పెళ్లి చేసుకోను ప్రస్తుతం 2024 ఒలింపిక్స్‌పై దృష్టి పెట్టాను. అది పారిస్‌లో ఉంది. ఆ ఒలంపిక్స్ లో ఎలాగైనా గోల్డ్ గెలవాలి, అది అయిన తర్వాతే నాకు నచ్చిన వ్యక్తిని పెళ్లి చేసుకుంటాను. సినిమా వాళ్లను మాత్రం చేసుకోవాలనే ఆశలు లేవు అని తెలిపింది సింధు.