Amitabh Bachchan : మరోసారి కరోనా బారిన పడ్డ అమితాబ్.. నాకు కరోనా వచ్చింది అంటూ ట్విట్టర్లో పోస్ట్ చేసిన బిగ్ బి

కరోనా ఇంకా తగ్గుముఖం పట్టలేదు. సాధారణ జనాలతో పాటు అన్ని జాగ్రత్తలు తీసుకునే సెలబ్రిటీలు కూడా రోజూ ఎవరో ఒకరు కరోనా బారిన పడుతున్నారు. తాజాగా బాలీవుడ్‌ బిగ్‌ బి అమితాబ్‌ బచ్చన్‌ మరోసారి కరోనా బారిన పడ్డారు. దీంతో ఇంట్లోనే ఐసొలేట్ అయి.............

Amitabh Bachchan : మరోసారి కరోనా బారిన పడ్డ అమితాబ్.. నాకు కరోనా వచ్చింది అంటూ ట్విట్టర్లో పోస్ట్ చేసిన బిగ్ బి

Amitabh Bachchan gets covid again

Updated On : August 24, 2022 / 8:05 AM IST

 

Amitabh Bachchan :  కరోనా ఇంకా తగ్గుముఖం పట్టలేదు. సాధారణ జనాలతో పాటు అన్ని జాగ్రత్తలు తీసుకునే సెలబ్రిటీలు కూడా రోజూ ఎవరో ఒకరు కరోనా బారిన పడుతున్నారు. తాజాగా బాలీవుడ్‌ బిగ్‌ బి అమితాబ్‌ బచ్చన్‌ మరోసారి కరోనా బారిన పడ్డారు. దీంతో ఇంట్లోనే ఐసొలేట్ అయి వైద్యులు సూచించిన జాగ్రత్తలు తీసుకుంటున్నారు.

Alia Bhatt : నేను నచ్చకపోతే నా సినిమాలు చూడకండి.. ఆలియా వ్యాఖ్యలు.. ఈ సారి బాయ్‌కాట్ అలియా..

ఈ మేరకు అమితాబ్ ట్వీట్ చేశారు. ”నేను కరోనా బారిన పడ్డాను. ఇటీవల నన్ను కలిసిన వారంతా కరోనా టెస్ట్ చేయించుకోండి” అంటూ ట్వీట్ చేశారు అమితాబ్. అమితాబ్‌కు మరోసారి కరోనా సోకిందని తెలిసి అభిమానులు ఆందోళనకు గురయ్యారు. ఆయన త్వరగా కోలుకోవాలని కోరుకుంటున్నారు. అమితాబ్‌ కరోనా బారిన పడటంతో ప్రముఖ టెలివిజన్‌ షో ‘కౌన్‌ బనేగా క్రోర్‌పతి’ కొత్త సీజన్‌ షూటింగ్‌ ప్రస్తుతానికి ఆగింది.