PVR INOX : థియేటర్స్‌లో కూడా సబ్‌స్క్రిప్షన్ ప్లాన్.. రూ.699 పాస్ తీసుకుంటే.. నెలలో..!
ఓటీటీతో థియేటర్స్ కి తగ్గుతున్న ఆదరణ చూసిన మల్టీప్లెక్స్ థియేటర్ల యాజమాన్యం.. ఒక సరికొత్త నిర్ణయాన్ని తీసుకొస్తుంది. థియేటర్స్‌లో కూడా సబ్‌స్క్రిప్షన్ ప్లాన్ ని అందుబాటులోకి..

PVR INOX will be made Movie pass subscription plan for movie lovers
PVR INOX : ప్రస్తుతం దేశంలో ఎంటర్టైన్మెంట్ రంగం చాలా బలంగా మారింది. ఈ రంగం నుంచి భారీ సంపాదన వస్తుంది. దీంతో మల్టీప్లెక్స్ థియేటర్స్, ఓటీటీ ప్లాట్‌ఫార్మ్స్.. ఇలా అనేక రంగులు పూసుకొని ఎంటర్టైన్మెంట్ ఆడియన్స్ ముందుకు వస్తుంది. ప్రస్తుతం ఓటీటీలు చాలా వేగంగా దూసుకు పోతున్నాయి. ప్రేక్షకులను ఆకర్షించేలా అనేక సబ్‌స్క్రిప్షన్ ప్లాన్స్ తీసుకోని వస్తున్నారు. నెలలో ఒకసారి ఆ సబ్‌స్క్రిప్షన్ ని రీ ఛార్జ్ చేసుకుంటే చాలు.. నెల మొత్తం సినిమాలు, సిరీస్ ని ఇంటిలోనే కూర్చొని చూసేవచ్చు.
థియేటర్ కి వెళ్లి రూ.100 పైగా టికెట్ కొని సినిమా చూడడం కంటే.. ఆ వందకి మరో వంద వేసి ఓటీటీ సబ్‌స్క్రిప్షన్ తీసుకోని ఇంటిలోనే హాయిగా చూడవచ్చు కదా అని ప్రేక్షకులు ఫీల్ అవుతున్నారు. దీంతో థియేటర్స్ కి ఆదరణ తగ్గుతుంది. ఇక ఇది గమనించిన మల్టీప్లెక్స్ థియేటర్ల యాజమాన్యం.. ఒక సరికొత్త నిర్ణయాన్ని తీసుకొస్తుంది. థియేటర్స్‌లో కూడా సబ్‌స్క్రిప్షన్ ప్లాన్ ని అందుబాటులోకి తీసుకు వస్తుంది. పివిఆర్ ఐనాక్స్ లో రూ.699 ఖర్చు చేసి మూవీ పాస్ తీసుకుంటే.. నెలలో 10 సినిమాల వరకు చూసేవచ్చు.
Also read : National Film Awards : రేపు ఢిల్లీలో జాతీయ అవార్డులు అందుకునే వారి కంప్లీట్ లిస్ట్ ఇదే..
అయితే సబ్‌స్క్రిప్షన్ ప్లాన్ సోమవారం నుంచి గురువారం మధ్యలోనే పని చేస్తుంది. రోజుకు ఒక మూవీ మాత్రమే చూడడానికి అవకాశం ఉంటుంది. 30 రోజులు పాటు ఈ సబ్‌స్క్రిప్షన్ ప్లాన్ పని చేస్తుంది. సుమారు 10 సినిమాలు చూసేందుకు అవకాశం కల్పిస్తున్నారు. అయితే ఈ సబ్‌స్క్రిప్షన్ ప్లాన్ ఆఫర్ సౌత్ ఇండియన్ థియేటర్స్ లో మాత్రం పివిఆర్ ఐనాక్స్ మానేజ్మెంట్ అందుబాటులోకి తీసుకు రావడం లేదు. కేవలం నార్త్ ఇండియాలో మాత్రమే ఈ ఆఫర్. ఈ విషయం పై సౌత్ ఆడియన్స్ అసహనం వ్యక్తం చేస్తున్నారు.