R Narayana Murthy : అలాంటి పాత్రలు చేయను అన్న ఆర్ నారాయణమూర్తి.. ఇప్పుడు నాని సినిమాలో నటిస్తాడా? ఫోటో వైరల్..

ఆర్ నారాయణ మూర్తి నాని పారడైజ్ సినిమాలో చేస్తాడనే వార్తలు వినిపిస్తున్నాయి.

R Narayana Murthy : అలాంటి పాత్రలు చేయను అన్న ఆర్ నారాయణమూర్తి.. ఇప్పుడు నాని సినిమాలో నటిస్తాడా? ఫోటో వైరల్..

R Narayana Murthy will Act in Nani The Paradise Movie Rumors goes Viral

Updated On : March 10, 2025 / 7:07 PM IST

R Narayana Murthy : పీపుల్ స్టార్ ఆర్ నారాయణమూర్తి మొదటి నుంచి విప్లవాత్మక సినిమాలు చేసారు. హీరోగా, దర్శకుడిగా ఎన్నో హిట్స్ కొట్టారు. విప్లవ సినిమాలకు కేరాఫ్ అడ్రెస్ గా మారారు. ఇప్పుడు అడపాదడపా సందేశాత్మక సినిమాలు చేస్తున్నారు. అయితే ఆయన ఏజ్ ఉన్న చాలా మంది సీనియర్ నటులు క్యారెక్టర్ ఆర్టిస్ట్ గా ఫుల్ బిజీగా ఉన్నారు. కానీ ఆర్ నారాయణమూర్తి తనకు క్యారెక్టర్ ఆర్టిస్ట్ గా ఆఫర్స్ వచ్చినా నో చెప్పుకుంటూ వస్తున్నారు.

గతంలో టెంపర్ సినిమాలో పోసాని కృష్ణమురళి పాత్రకి మొదట పూరీ జగన్నాధ్ ఆర్ నారాయణమూర్తినే అడిగారు. కానీ ఆయన నేను కష్టపడి ఎదిగి పైకి వచ్చి హీరో, దర్శకుడిగా మారాను, మళ్ళీ వెనక్కి వెళ్లి క్యారెక్టర్ ఆర్టిస్ట్ గా చేయలేను. కమర్షియల్ సినిమాల్లో నేను భాగం అవ్వాలనుకోవట్లేదు అని నో చెప్పారు. ఆ తర్వాత చాలా మంది అడిగినా నో చెప్పారు. ఇటీవల రామ్ చరణ్ – బుచ్చిబాబు సాన సినిమాలో కూడా ఓ పాత్ర కోసం అడిగితే చెయ్యను అనే చెప్పారట.

Also See : యాంకర్ సుమతో కిరణ్ అబ్బవరం స్పెషల్ ఇంటర్వ్యూ.. ఫన్నీ, ఎమోషనల్ ప్రోమో చూసేయండి..

అయితే ఇప్పుడు ఆర్ నారాయణ మూర్తి నాని పారడైజ్ సినిమాలో చేస్తాడనే వార్తలు వినిపిస్తున్నాయి. ఇటీవలే శ్రీకాంత్ ఓదెల దర్శకత్వంలో నాని హీరోగా తెరకెక్కుతున్న ది పారడైజ్ సినిమా గ్లింప్స్ కూడా రిలీజ్ చేసి ఒక్కసారిగా అంచనాలు పెంచారు. తాజాగా డైరెక్టర్ శ్రీకాంత్, అతని టీమ్ ఆర్ నారాయణ మూర్తితో దిగిన ఫోటోలను సోషల్ మీడియాలో షేర్ చేసారు. ఇప్పుడు డైరెక్టర్, అతని టీమ్ కూడా దిగిన ఫోటో షేర్ చేయడంతో నాని ది పారడైజ్ సినిమాలో ఆర్ నారాయమూర్తి చేస్తున్నాడేమో అని వార్తలు వస్తున్నాయి.

 

Also Read : Robinhood Song : ‘రాబిన్ హుడ్’ నుంచి ఐటెం సాంగ్ అదిదా సర్‌ప్రైజ్ వచ్చేసింది.. మల్లెపూలతో మత్తెక్కిస్తూ కేతిక శర్మ..

అయితే ఆర్ నారాయమూర్తిని శ్రీకాంత్ క్యారెక్టర్ అడగడానికి వెళ్ళాడేమో అని కొంతమంది అంటున్నారు. అసలు క్యారెక్టర్ ఆర్టిస్ట్ గా చేయను అని చెప్పిన ఆర్ నారాయణ మూర్తి ఇప్పుడు నాని సినిమాలో చేస్తాడా అనే సందేహం వ్యక్తపరుస్తున్నారు. ఒకవేళ నిజంగానే నాని పారడైజ్ సినిమాలో నారాయణమూర్తి కీలక పాత్ర చేస్తే సినిమాపై అంచనాలు పెరగడమే కాక ఆయనకు మరిన్ని అవకాశాలు వస్తాయి. ఇప్పటికే ఆయన ఓకే అంటే ఆయనకు పాత్రలు ఇవ్వడానికి చాలా మంది రెడీగా ఉన్నారు. కానీ ఆర్ నారాయణమూర్తి ఒప్పుకోవట్లేదు. చూడాలి మరి నాని సినిమాలో ఆర్ నారాయణమూర్తి కనిపిస్తారా లేదా.