Raashii Khanna : ఆ హీరోపై మనసుపడ్డా.. అన్‌స్టాపబుల్‌లో రాశి ఖన్నా కామెంట్స్..
అన్‌స్టాపబుల్ సీజన్ 2లో.. బాలకృష్ణ ఎవరు ఊహించని గెస్ట్ లను తీసుకు వస్తూ అందర్నీ ఆశ్చర్యపరుస్తున్నాడు. తాజాగా ఇప్పుడు కొత్త ఎపిసోడ్ గెస్ట్‌లుగా అలనాటి హీరోయిన్లు తీసుకువచ్చాడు. అందం అభినయం కలగలిపిన సహజనటి జయసుధ, ముల్టీటాలెంటెడ్ జయప్రద ఈ కొత్త ఎపిసోడ్ లో బాలయ్యతో కలిసి సందడి చేయనున్నారు. వీరితో పాటు..

Raashii Khanna open up about her crush
Raashii Khanna : అన్‌స్టాపబుల్ సీజన్ 2లో.. బాలకృష్ణ ఎవరు ఊహించని గెస్ట్ లను తీసుకు వస్తూ అందర్నీ ఆశ్చర్యపరుస్తున్నాడు. ఈ క్రమంలోనే మొదటి ఎపిసోడ్‌కే ఆంధ్రప్రదేశ్ మాజీ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడుని తీసుకువచ్చి అదరగొట్టిన బాలయ్య, తాజాగా పాన్ ఇండియా స్టార్ ప్రభాస్ ని తీసుకువచ్చి అన్‌స్టాపబుల్ గా దూసుకుపోతున్నాడు. ప్రభాస్ ఎపిసోడ్ ఈ నెల 30న ప్రసారం కానున్నట్లు ప్రకటించారు షో నిర్వాహకులు.
Prabhas: ప్రభాస్-మారుతి మూవీలో బాలీవుడ్ హీరో అలాంటి పాత్ర చేస్తాడా..?
కాగా ఇప్పుడు కొత్త ఎపిసోడ్ గెస్ట్‌లుగా అలనాటి హీరోయిన్లు తీసుకువచ్చాడు. అందం అభినయం కలగలిపిన సహజనటి జయసుధ, ముల్టీటాలెంటెడ్ జయప్రద ఈ కొత్త ఎపిసోడ్ లో బాలయ్యతో కలిసి సందడి చేయనున్నారు. వీరితో పాటు ప్రెజెంట్ టాలీవుడ్ హీరోయిన్ రావిషింగ్ రాశి ఖన్నా కూడా హాజరయ్యి ఎపిసోడ్ కి ఇంకొంచెం గ్లామర్ పెంచనుంది. ఇక ఈ ఎపిసోడ్ కి సంబంధించిన ప్రోమోని విడుదల చేశారు మేకర్స్.
ముగ్గురు భామల మధ్య బాలకృష్ణ.. నారి నారి నడుమ నందమూరి అంటూ చిలిపి అల్లరి చేయనున్నాడు. కాగా ఈ ప్రోమోలో బాలయ్య, రాశి ఖన్నాని.. ‘నువ్వు నటించిన హీరోల్లో నీకు ఎవరి మీద క్రష్ ఉంది’ అంటూ ప్రశ్నించాడు. ఈ ప్రశ్నకు రాశి.. ‘నాకు విజయ్ దేవరకొండ మీద క్రష్ ఉంది’ అంటూ తన మనసులోని మాటని చెప్పుకొచ్చింది. గతంలో ఈ అమ్మడు విజయ్ తో ‘వరల్డ్ ఫేమస్ లవర్’ సినిమాలో నటించింది.
Mugguru muddhugummala tho mana balakrishnudu. Ayana allari, sandadi chudaalsindhe. December 23 na, mee aha lo.?#UnstoppableWithNBKS2 #NBKOnAHA #Jayasudha @realjayaprada #RaashiKhanna #MansionHouse @tnldoublehorse @realmeIndia @Fun88India #ChandaBrothers @sprite_india pic.twitter.com/QTRIEZHD7e
— ahavideoin (@ahavideoIN) December 19, 2022