Raashii Khanna : కియారా భర్తని రాశీఖన్నా పెళ్లి చేసుకుంటే బాగుండేది.. నెటిజన్స్ కామెంట్స్ కి కౌంటర్ ఇచ్చిన రాశీఖన్నా..

సిద్దార్థ్ మల్హోత్రాకు ఆల్రెడీ కియారా అద్వానితో గత సంవత్సరం పెళ్లి జరిగింది. ఆల్రెడీ పెళ్లి అయిపోయిన సిద్దార్థతో రాశీఖన్నా పెళ్లి చేసుకుంటే బాగుండేది అని కామెంట్స్ రావడంతో ఇవి వైరల్ గా మారాయి.

Raashii Khanna : కియారా భర్తని రాశీఖన్నా పెళ్లి చేసుకుంటే బాగుండేది.. నెటిజన్స్ కామెంట్స్ కి కౌంటర్ ఇచ్చిన రాశీఖన్నా..

Raashii Khanna Reacts on Fans and Ntizens Comments about her pair with Sidharth Malhotra in Yodha Movie

Updated On : March 29, 2024 / 10:56 AM IST

Raashii Khanna : టాలీవుడ్ భామ రాశీఖన్నా ఇటీవల మళ్ళీ బాలీవుడ్ వెళ్ళింది. సిద్దార్థ్ మల్హోత్రా(Sidharth Malhotra) సరసన ‘యోధ'(Yodha) సినిమాలో నటించగా ఈ సినిమా మార్చ్ 15న రిలీజయి పాజిటివ్ టాక్ తెచ్చుకుంది. అయితే ఈ సినిమాలో సిద్దార్థ్ మల్హోత్రా – రాశీఖన్నా పెయిర్ బాగుందని, ఇద్దరూ క్యూట్ గా ఉన్నారని, ఒకరికి ఒకరు మేడ్ ఫర్ ఈచ్ అదర్ అని నెటిజన్లు, అభిమానులు కామెంట్స్ చేసారు. ఇక కొంతమంది అయితే రాశీఖన్నా సిద్దార్థ్ మల్హోత్రాని పెళ్లి చేసుకుంటే బాగుండేది అని కూడా కామెంట్స్ చేయగా ఇవి వైరల్ అయ్యాయి.

ఎందుకంటే సిద్దార్థ్ మల్హోత్రాకు ఆల్రెడీ కియారా అద్వానితో గత సంవత్సరం పెళ్లి జరిగింది. దీంతో ఆల్రెడీ పెళ్లి అయిపోయిన సిద్దార్థతో రాశీఖన్నా పెళ్లి చేసుకుంటే బాగుండేది అని కామెంట్స్ రావడంతో ఇవి వైరల్ గా మారాయి. తాజాగా బాలీవుడ్ లో ఇచ్చిన ఓ ఇంటర్వ్యూలో యాంకర్ రాశీఖన్నాని దీని గురించి ప్రస్తావించి అడిగాడు.

Also Read : Prathinidhi 2 : ప్రతినిధి 2 టీజర్ వచ్చేసింది.. ఎన్నికల ముందు మరో పొలిటికల్ టీజర్..

దీనికి రాశీఖన్నా సమాధానమిస్తూ.. అభిమానులకు, ప్రేక్షకులకు వారు చూసే నటీనటులపై వివిధ అభిప్రాయాలు ఉండొచ్చు. వారు తీసే సినిమాలు, కలిసి నటించే వారితో రకరకాల అభిప్రాయాలూ ఉంటాయి. కానీ వారికి మా పర్సనల్ లైఫ్స్ గురించి తెలియదు. సినిమాలో కలిసి అందంగా కనిపించినంత మాత్రాన, సినిమాలో మేడ్ ఫర్ ఈచ్ అదర్ అనిపించినా మాత్రాన బయట ఆది సాధ్యపడదు. రియాలిటీలో అవి జరగకపోవచ్చు. మా ఇద్దరి నటన, ఆన్ స్క్రీన్ మీద మా కెమిస్ట్రీ వారికి నచ్చి అలా మాట్లాడి ఉండొచ్చు. సినిమా వేరు, రియల్ లైఫ్ వేరు అని తెలిపింది.