Radhe Shyam Trailer : తెలుగు తెరపై ‘టైటానిక్’ చూడబోతున్నాం!

తెలుగు తెరపై ‘టైటానిక్’ ని చూడబోతున్నామని ‘రాధే శ్యామ్’ మూవీ టీం కాన్ఫిడెంట్‌గా చెప్తున్నారు..

Radhe Shyam Trailer : తెలుగు తెరపై ‘టైటానిక్’ చూడబోతున్నాం!

Radhe Shyam

Updated On : December 23, 2021 / 3:11 PM IST

Radhe Shyam Trailer: ‘బాహుబలి’ తో తెలుగు సినిమా స్థాయిని పెంచడంతో పాటు ‘పాన్ ఇండియా స్టార్’ గా గుర్తింపు తెచ్చుకున్నాడు రెబల్ స్టార్ ప్రభాస్. తర్వాత వరుసగా పాన్ ఇండియా ఆ తర్వాత పాన్ వరల్డ్ సినిమాలతో సందడి చేస్తున్నాడు. దాదాపు మూడేళ్లుగా ‘రాధే శ్యామ్’ సినిమాకే అంకితమైపోయారు ప్రభాస్ అండ్ రాధా కృష్ణ..

Radhe Shyam : 30 నిమిషాల పాటు భారీ షిప్‌లో

ఇప్పటివరకు రిలీజ్ చేసిన ప్రోమోస్ అండ్ సాంగ్స్‌కి మంచి రెస్పాన్స్ వచ్చింది. రిలీజ్ డేట్ దగ్గర పడుతుండడంతో ప్రమోషన్స్ స్పీడప్ చేసింది టీం. గురువారం డార్లింగ్ ఫ్యాన్స్ చేతుల మీదుగా ‘రాధే శ్యామ్’ థియేట్రికల్ ట్రైలర్ రిలీజ్ చేయించబోతున్నారు.

Radhe Shyam : రెబల్ స్టార్ రేంజ్.. నార్త్‌లో బిగ్గెస్ట్ రిలీజ్..

ట్రైలర్ సినిమా మీద అంచనాలు పెంచడం అనేది ఎలాగో జరుగుతుంది కానీ తెలుగు తెరమీద ఆ మాటకొస్తే ఇండియన్ స్క్రీన్ మీద ఇంతకుముందెన్నడూ చూడని విజువల్ వండర్ లాంటి లవ్ స్టోరీ ఇదని.. తెలుగు తెరపై ‘టైటానిక్’ ని చూడబోతున్నామని మూవీ టీం కాన్ఫిడెంట్‌గా చెప్తున్నారు. సంక్రాంతి కానుకగా 2022 జనవరి 14న ‘రాధే శ్యామ్’ ప్రపంచవ్యాప్తంగా భారీ స్థాయిలో విడుదల కానుంది.

Radhe Shyam: ప్రభాస్‌తో గొడవ.. ప్రీ రిలీజ్ ఈవెంట్‌కు పూజా వస్తుందా?