Janmashtami : ప్రభాస్ ఫ్యాన్స్‌కు సర్ ఫ్రైజ్, ‘రాధే శ్యామ్’ న్యూ పోస్టర్

పిరియాడికల్ లవ్ డ్రామాగా తెరకెక్కుతున్న ‘రాధే శ్యామ్’ షూటింగ్ కొనసాగుతోంది. సెలెన్స్ గా ఓ పోస్టర్ ను చిత్ర యూనిట్ రిలీజ్ చేసింది.

Janmashtami : ప్రభాస్ ఫ్యాన్స్‌కు సర్ ఫ్రైజ్, ‘రాధే శ్యామ్’ న్యూ పోస్టర్

Prabhas

Updated On : August 30, 2021 / 11:10 AM IST

Radhe Shyam : టాలీవుడ్ యంగ్ రెబల్ స్టార్ ప్రభాస్ మూవీ కోసం అభిమానులు ఎంతగానో ఎదురు చూస్తున్నారు. ప్రస్తుతం ‘జిల్’ ఫేం రాధాకృష్ణ కుమార్ తెరకెక్కిస్తున్న పిరియాడికల్ లవ్ డ్రామాగా తెరకెక్కుతున్న ‘రాధే శ్యామ్’ షూటింగ్ ఇంకా కొనసాగుతోంది. సినిమాకు సంబంధించి పోస్టర్లు, టీజర్ రిలీజ్ అయిన సంగతి తెలిసిందే.

Read More : Suryapet : అమానుషం.. మహిళను వివస్త్రను చేసి.. కళ్లలో కారం కొట్టిన గ్రామస్తులు

అయితే..సెలెన్స్ గా ఓ పోస్టర్ ను చిత్ర యూనిట్ రిలీజ్ చేసింది. శ్రీ కృష్ణాష్టమి సందర్భంగా మూవీ నుంచి పోస్టర్ ను విడుదల చేశారు మేకర్స్. ఫొటోలో హీరోయిన్ పూజా హెగ్డే నెమలి ఈకలతో ఉన్న బ్లూ కలర్ డ్రెస్ ధరించగా..ప్రభాస్ బ్లాక్ కలర్ కోట్ ధరించాడు. రొమాంటిక్ లుక్ ఉన్న ఈ పోస్టర్ చూసి అభిమానులు ఫిదా అవుతున్నారు.

Read More : Radhe Shyam : సంక్రాంతికి ‘రాధే శ్యామ్’.. ‘వర్షం’ మ్యాజిక్ రిపీట్ అవుతుందా..?

ఇక ఈ చిత్ర విషయానికి వస్తే…ప్రముఖ నిర్మాణ సంస్థలు గోపీ కృష్ణ మూవీస్, యూవీ క్రియేషన్స్ బ్యానర్లపై వంశీ, ప్రమోద్, ప్రసీద ఈ పాన్ ఇండియాను భారీ స్థాయిలో తెరకెక్కిస్తున్నారు. 1980లో యూరప్ నేపథ్యంలో రొమాంటిక్ లవ్ స్టోరీని ప్రేక్షకులకు చూపించబోతున్నారు. ఆ కాలం నాటి సెట్లను నిర్మించారు.

Read More : ‘రాధే శ్యామ్’ మ‌హా శివ‌రాత్రి విషెస్

2022 జనవరి 14వ తేదీన చిత్రాన్ని రిలీజ్ చేయనున్నట్లు చిత్ర యూనిట్ ప్రకటించిన సంగతి తెలిసిందే. 2004, జనవరి 14వ తేదీన ప్రభాస్ ‘వర్షం’ రిలీజ్ అయ్యింది. ఈ చిత్రం ఎంత పెద్ద హిట్ అయ్యిందో ప్రత్యేకంగా చెప్పాల్సినవసరం లేదు. మరి…ఈ మూవీతో ప్రభాస్ మెప్పిస్తారా ? లేదా ? అనేది చూడాలి.