Radheshyam Trailer :  రాధేశ్యామ్ ట్రైలర్‌లో ఇది గమనించారా?

రెబెల్ స్టార్ ప్రభాస్, అందాల భామ పూజ హెగ్డే ప్రధాన పాత్రల్లో.. రాధాకృష్ణ దర్శకత్వంలో తెరకెక్కిన చిత్రం రాధేశ్యామ్.. ఈ చిత్రం జనవరి 14న ప్రపంచ వ్యాప్తంగా విడుదల కానుంది

Radheshyam Trailer :  రాధేశ్యామ్ ట్రైలర్‌లో ఇది గమనించారా?

Radheshyam Trailer

Updated On : December 24, 2021 / 9:24 AM IST

Radheshyam Trailer : రెబెల్ స్టార్ ప్రభాస్, అందాల భామ పూజ హెగ్డే ప్రధాన పాత్రల్లో.. రాధాకృష్ణ దర్శకత్వంలో తెరకెక్కిన చిత్రం రాధేశ్యామ్.. ఈ చిత్రం జనవరి 14న ప్రపంచ వ్యాప్తంగా విడుదల కానుంది. భారీ బడ్జెట్‌తో తెరకెక్కిన ఈ సినిమాపై అంచనాలు భారీగానే ఉన్నాయి. మూడేళ్ళ తర్వాత ప్రభాస్ సినిమా వస్తుంది.. ఈ సినిమా కోసమా అభిమానులు ఆసక్తిగా ఎదురుచూస్తున్నారు. ఇక ఈ నేపథ్యంలోనే గురువారం చిత్ర ప్రీ రిలీజ్ ఈవెంట్ జరిగింది. ఈ వేడుకకు రామోజీ ఫిల్మ్ సిటీ వేదిక కాగా.. 40 వేలమంది అభిమానులు తరలివచ్చారు.

చదవండి : Radheshyam : ప్రీ రిలీజ్ ఈవెంట్‌లో ప్రభాస్ ఫన్నీ స్పీచ్.. నాకు సిగ్గేస్తుంది బాబో..!

ఇదిలా ఉంటే.. ఈ వేడులకలో రాధేశ్యామ్ ట్రైలర్ అభిమానుల చేతుల మీదుగా విడుదల చేశారు. . ప్రపంచవ్యాప్తంగా దేశ నాయకులు కలవాలి అనుకునే పేరున్న హస్త సముద్రికుడు విక్రమాదిత్యగా ప్రభాస్ కనిపించబోతున్నారు. ప్రాణం పోసే ప్రేమ ప్రాణాలను తీయగలదా అంటూ ప్రభాస్ చెప్పే డైలాగ్స్ ఆకట్టుకుంటున్నాయి. ఇందులో ప్రభాస్ ప్రేయసి ప్రేరణగా పూజా హెగ్డే నటించింది. కృష్ణంరాజు, భాగ్యశ్రీ, సచిన్‌ ఖేడ్‌కర్‌ తదితరులు కీలక పాత్రలు పోషించారు. ట్రైలర్ లో రొమాంటిక్, యాక్షన్ సన్నివేశాలతో అందరిని ఆకట్టుకుంటుంది. విడుదలైన గంటల వ్యవధిలోనే ఐదు మిలియన్ వ్యూస్ సొంతం సాధించింది.

చదవండి : Radheshyam : ‘రాధేశ్యామ్’ ట్రైలర్ రిలీజ్ డేట్ ఫిక్స్.. చీఫ్ గెస్టులు వాళ్ళే…