Chandramukhi 2 : చంద్రముఖి-2 రన్‌టైం ఎంతో తెలుసా..? అన్ని గంటలు అంటే మాటలు కాదు..!
రాఘవ లారెన్స్ (Raghava Lawrence) నటిస్తున్న చిత్రం ‘చంద్రముఖి 2’ (Chandramukhi 2). పి.వాసు దర్శకత్వంలో తెరకెక్కుతున్న ఈ సినిమాలో కంగనా రనౌత్ (Kangana Ranaut) హీరోయిన్‌గా నటిస్తోంది.

Chandramukhi 2
Chandramukhi 2 run time : రాఘవ లారెన్స్ (Raghava Lawrence) నటిస్తున్న చిత్రం ‘చంద్రముఖి 2’ (Chandramukhi 2). పి.వాసు దర్శకత్వంలో తెరకెక్కుతున్న ఈ సినిమాలో కంగనా రనౌత్ (Kangana Ranaut) హీరోయిన్‌గా నటిస్తోంది. ఆస్కార్ అవార్డు గ్రహీత ఎంఎం కీరవాణి (MM Keeravaani) సంగీతాన్ని అందిస్తుండగా లైకా ప్రొడక్షన్స్ బ్యానర్‌పై సుభాస్కరన్ భారీ బడ్జెట్‌తో ఈ చిత్రాన్ని నిర్మిస్తున్నారు. తమిళం, తెలుగు, హిందీ, మలయాళం, కన్నడ భాషల్లో సెప్టెంబర్ 28న ఈ సినిమా ప్రేక్షకుల ముందుకు రానుంది. కాగా.. ఈ చిత్రానికి సంబంధించిన ఓ వార్త ప్రస్తుతం నెట్టింట హల్ చల్ చేస్తోంది.
ప్రస్తుతం వస్తున్న చిత్రాలు అన్నీ దాదాపు రెండున్నర గంటలకు కాస్త అటు ఇటుగానే ఉంటున్నాయి. అయితే.. చంద్రముఖి-2 సినిమా రన్ టైం మాత్రం 170 నిమిషాలు అంట. అంటే 2 గంటల 50 నిమిషాలు. ఇప్పుడు ఇది చర్చనీయాంశంగా మారింది. అంత సేపు ప్రేక్షకులను థియేటర్లలో ఉంచడం అంటే మామూలు విషయం కాదు. మంచి కథతో పాటు విజువల్ ఎఫెక్ట్స్ సైతం చాలా బాగా ఉంటేనే అది సాధ్యం అవుతుంది. అయితే.. దర్శకుడు వాసుతో పాటు చిత్ర బృందం కూడా చంద్రముఖి-2 సినిమా పట్ల చాలా కాన్ఫిడెంట్‌గా ఉన్నారట. అందునే రన్ టైం విషయంలో ఎలాంటి కాంప్రమైజ్ కావడం లేదంట.
వడివేలు, మహిమా నంబియార్, లక్ష్మీ మీనన్, సృష్టి డాంగే, రావు రమేష్, విఘ్నేష్, రవి మారియా, సురేష్ మీనన్, సుభిక్ష కృష్ణన్ కీలక పాత్రలు పోషిస్తున్న ఈ సినిమా షూటింగ్ ఎప్పుడో పూర్తి అయ్యింది. ప్రస్తుతం పోస్ట్ ప్రొడక్షన్ కార్యక్రమాలు జరుగుతున్నాయి. ఇప్పటికే విడుదలైన ట్రైలర్, పాటలు సినిమాపై అంచనాలను పెంచేశాయి. వాస్తవానికి ఈ సినిమాని సెప్టెంబర్ 15న విడుదల చేయాలని మొదట బావించారు. అయితే.. కొన్ని కారణాలు వల్ల సెప్టెంబర్ 28కి వాయిదా వేశారు.