Chandramukhi 2 Review : చంద్రముఖి 2 రివ్యూ.. ఆల్రెడీ చూసిన సినిమానే మళ్ళీ చూపించారుగా..

రాఘవ లారెన్స్, కంగనా నటించిన చంద్రముఖి 2 ఆడియన్స్ ముందుకు వచ్చేసింది. మరి థియేటర్స్ లో ఈ మూవీ ప్రేక్షకులను బయపెట్టిందా..?

Chandramukhi 2 Review : చంద్రముఖి 2 రివ్యూ.. ఆల్రెడీ చూసిన సినిమానే మళ్ళీ చూపించారుగా..

Raghava Lawrence Kangana Ranaut Chandramukhi 2 Movie Review

Updated On : September 29, 2023 / 9:10 PM IST

Chandramukhi 2 Review : రాఘవ లారెన్స్ (Raghava Lawrence), కంగనా రనౌత్ (Kangana Ranaut) ప్రధాన పాత్ర‌ల్లో తెరకెక్కిన సినిమా ‘చంద్రముఖి 2’. ఒకప్పటి సూపర్ హిట్ రజినీకాంత్ సినిమా చంద్రముఖికి సీక్వెల్ గా అదే దర్శకుడు పి.వాసు దర్శకత్వంలో చంద్రముఖి 2 వచ్చింది. లైకా ప్రొడ‌క్ష‌న్స్ బ్యాన‌ర్‌పై సుభాస్క‌ర‌న్ భారీ బ‌డ్జెట్‌తో ఈ సినిమాని నిర్మించారు. ఎంఎం కీర‌వాణి (MM Keeravaani) సంగీతాన్ని అందించగా ఇందులో మహిమా నంబియార్, లక్ష్మి మీనన్, రాధికా శరత్ కుమార్.. పలువురు ముఖ్య పాత్రలు పోషించారు.

Also Read: భగవంత్ కేసరి జర్నీ వీడియో రిలీజ్.. బాలయ్య మాస్ డైలాగ్..

కథ విషయానికి వస్తే గతంలో మనం ఏదైతే రజినీకాంత్ చంద్రముఖి సినిమా చూశామో అదే కథ. ఒక ఫ్యామిలీ అంతఃపురానికి వస్తారు, అక్కడ చంద్రముఖి గది ఉండే వైపు ఆ ఫ్యామిలిలో ఒకరు వెళ్తారు. చంద్రముఖి బయటకి వస్తుంది. అయితే ఈ సారి ఆ రాజు ఆత్మ కూడా బయటకి వచ్చి హీరో శరీరంలోకి వెళ్లి చివర్లో రెండు ఆత్మలు కొట్టుకుంటాయి. చివరికి ఆత్మలు పోయి హీరో, చంద్రముఖి ఆవహించిన అమ్మాయి ఎలా బయటపడ్డారు అనేదే కథ.

Also Read : విజ‌య్ దేవ‌ర‌కొండ ఎప్ప‌టికీ ది బెస్ట్‌.. ర‌ష్మిక‌కు స‌డెన్‌గా ఎందుకు గుర్తుకు వ‌చ్చాడో తెలుసా?

చంద్రముఖి సినిమాలో కథ, కథనం ఎలా అయితే చూపించారో ఇందులో కూడా అదే చూపించడంతో తెలిసిన కథే కదా అనిపిస్తుంది. కనీసం దాన్ని కొత్తగా కూడా చూపించలేదు. ఫస్ట్ హాఫ్ చాలా బోరింగ్ గా సాగుతుంది. సెకండ్ హాఫ్ ఇంట్రెస్ట్ గా ఉంటుంది అనుకుంటే అది మరింత బోర్ గా సాగుతుంది. రాఘవ లారెన్స్ చాలా చోట్ల రజినీకాంత్ లా యాక్ట్ చేయడానికి ప్రయత్నించాడు. కంగనా ఆ చంద్రముఖి క్యారెక్టర్ కి అస్సలు సూట్ అవ్వలేదు. సినిమాలో చంద్రముఖి ఆవహించిన అమ్మాయిగా లక్ష్మి మీనన్ మాత్రం చాలా బాగా చేసింది. BGM, పాటలు కూడా అంతగా వర్కౌట్ అవ్వలేదు. వడివేలుతో కామెడీ సీన్స్ ట్రై చేసినా అవి కూడా వర్కౌట్ అవ్వలేదు. అసలు ఇందులోఎక్కడా భయం కూడా కలిగే సీన్స్ లేవు.

మొత్తానికి ఒకసారి తీసిన సినిమానే మళ్ళీ తీసి మనకి మళ్ళీ చంద్రముఖి 2 అని చూపించారు. అందుకే కొన్ని క్లాసిక్ సినిమాలని సీక్వెల్స్ అంటూ ముట్టుకోకూడదు అంటారు. అది ఈ సినిమాతో మళ్ళీ ప్రూవ్ అయింది.

గమనిక : ఈ రివ్యూ, రేటింగ్ కేవలం విశ్లేషకుడి అభిప్రాయం మాత్రమే..